Ram Charan : టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామీలీకి సంబంధించిన హీరోలపై అభిమానులు ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. వారు చేసే సినిమాలతోపాటు పర్సనల్ విషయాలపై ఓ లుక్కేస్తుంటారు. మెగా వారసుడు రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ స్టేటస్ సంపాదించుకోగా, ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో RC 15 మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ నుంచి చిన్న గ్యాప్ దొరకడంతో ఊటీ అందాలు వీక్షించేందుకు వెళ్లాడు. అక్కా చెల్లెలు, ఫ్రెండ్స్‌తో కలిసి చిన్నపాటి ట్రిప్‌కు వెళ్లిపోయాడు. గత వారం ఫ్లైట్‌లో వెళుతున్న పిక్‌ను చెర్రీ సోషల్ మీడియాలో పంచుకోగా.. ఎక్కడికి వెళుతున్నారో చెప్పలేదు.
తాజాగా రామ్ చరణ్ సోదరీమణులతో దిగిన ఫోటోను చిరంజీవి షేర్ చేశారు. దానికి స్టన్నింగ్ కామెంట్ పెట్టాడు. తమ పిల్లలందరూ ఒక దగ్గర ఉల్లాసంగా గడిపితే ఆ తల్లిదండ్రులకు కలిగే ఉత్సాహమే వేరు అంటూ కాస్తంత ఎమోషనల్ అయ్యారు. ఊటీలోని ఓ రెస్టారెంట్‌లో లంచ్ చేస్తున్న ఫొటోను చిరంజీవి షేర్ చేయగా, ఇది తెగ హల్‌చల్ చేస్తుంది. ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక చిరంజీవి ఇద్దరు కూతుళ్లలో పెద్ద కూతురు సుస్మిత.. గోల్డ్ బాక్స్ అంటూ వెబ్ సిరీస్‌తోపాటు సినిమాలు నిర్మిస్తోంది. అటు శ్రీజ చిరంజీవి కూతురుగా గుర్తింపు ఉంది.
గతంలో కంటే రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ జెట్ స్పీడుతో దూసుకుపోతోన్నారు టాలీవుడ్ బడా హీరో మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే ఇలా పలు సినిమాలను ప్రేక్షకులకు అందించిన ఆయన.. ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూనే ఉన్నారు. ఇలా ఇప్పుడు ఏకకాలంలోనే కొన్ని సినిమాలను చేసుకుంటూ వస్తున్నారు. అందులో కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వంలో నటిస్తోన్న సినిమా ఒకటి. ఇందులో మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మూవీ స్ట్రైట్ మూవీ కావడంతో చాలా అంచనాలు ఉన్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…