Rakshitha : రవితేజ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం ఇడియట్. ఇందులో కథానాయికగా నటించింది రక్షిత. చిత్రంలో రక్షిత ఎంతో నాజూకుగా, క్యూట్ క్యూట్ అందంతో కుర్రకారు మతులు పోగొట్టింది.ఈ సినిమాతో రక్షితకి ఫుల్ పాపులారిటీ దక్కగా, ఆ తర్వాత పలు సినిమాలలో నటించే అవకాశం దక్కింది. ‘పెళ్ళాం ఊరెళితే’ వంటి సూపర్ హిట్ చిత్రంలో నటించిన ఈ బ్యూటీ.. వెంటనే మహేష్ తో ‘నిజం’ అనే సినిమాలో నటించింది. ఆ చిత్రం పెద్దగా ఆడకపోయినా అగ్ర హీరోగాలైన.. నాగార్జునతో ‘శివమణి’, ఎన్టీఆర్ తో ‘ఆంధ్రావాలా’, చిరంజీవి తో ‘అందరివాడు’ వంటి చిత్రాలు చేసే అవకాశాలు దక్కించుకుంది.
రక్షిత ఒకప్పుడు ఓ ఊపు ఊపేసిన తరువాత ఆఫర్లు పెద్దగా రాకపోవడంతో కన్నడ ఇండస్ట్రీకి చెక్కేసి అక్కడ కొన్ని చిత్రాలు చేసింది. అనంతరం 2007 లో కన్నడ డైరెక్టర్ ప్రేమ్ ను వివాహం చేసుకుని సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పింది. అయితే కన్నడ టీవీ షోలలో అప్పుడప్పుడు జడ్జిగా కూడా కనిపించి సందడి చేసింది. అయితే ప్రస్తుతం రక్షిత లుక్స్ అభిమానులని ఆందోళనకి గురి చేస్తున్నాయి. ఒకప్పుడు చాలా అందంగా కనిపించిన రక్షిత ఇప్పుడు ఇంత బొద్దుగా కనిపించే సరికి అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు.
అసలు ఈమె ‘ఇడియట్’ హీరోయినా…? అని షాకయ్యేలా ఉంది ఈమె లుక్. అంతలా ఈమె మొహం కూడా మారిపోయింది. అయితే ఆమె అలా బరువు పెరగడానికి గల కారణం తన కొడుకు పుట్టిన తర్వాత థైరాయిడ్ వలన అంటూ రక్షిత ఓ సందర్భంలో ప్రేక్షకులకు తెలిపారు. ప్రస్తుతం రక్షిత భారీ ఆకారంతో ఉండగా, ఆమెకు సంబంధించిన కొన్ని ఫొటొలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి.ఈమె అసలు పేరు శ్వేత. రక్షిత జన్మించింది బెంగళూరులో. ఇక ఈమె తండ్రి బిసి గౌరీశంకర్ కొరియోగ్రాఫర్. ఈమె తల్లి కూడా మమతా రావు కన్నడ నటి. ఇక వీరిద్దరూ కూడా ఇండస్ట్రీలో ఉండడంతో ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు చాలా సులువుగా అయ్యింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…