Akhanda Movie : నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ చిత్రం అఖండ . ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా, జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్‌గా హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో మురళీకృష్ణ, శివుడు పాత్రల్లో బాలయ్య అద్భుతంగా నటించారు. ముఖ్యంగా అఘోర పాత్రలో అయితే అదరగొట్టేశాడు. ఆ పాత్ర బాలయ్య తప్ప ఇంకే హీరో చేయలేనంతగా అదరగొట్టాడు.
అయితే ఈ సినిమాకి అఖండ అనే టైటిల్ ఫిక్స్ చేయకముందు మహర్జాతకుడు అనే టైటిల్‌ను అనుకున్నారట. ఈ కథను 2014వ సంవత్సరంలోనే వినిపించారట. అప్పటి నుండి కథపై కసరత్తులు చేసి గత ఏడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. టైటిల్ ఎందుకు మార్చారు అని నిర్మాతలని అడగగా, దానికి నిర్మాత సమాధానం ఇస్తూ సినిమా చూస్తే మీకే తెలుస్తుంది అని రిలీజ్‌కి ముందు నిర్మాత స్పష్టం చేశారు. ఇక అఖండ సినిమా విషయంలో లాజిక్స్ లేకపోయినా కూడా మాస్ మ్యాజిక్ ఈ సినిమాలో బాగానే పని చేసింది.
కరోనా సెకండ్ వేవ్ తర్వాత బడా స్టార్ హీరోలు తమ సినిమాలు రిలీజ్ చేయాలా వద్దా అనే ఆలోచనలో ఉన్న సమయంలో బాలయ్య బెదరకుండా ‘అఖండ’ సినిమాను రిలీజ్ చేసి మిగతా బడా స్టార్ హీరోలకు భరోసా ఇచ్చారు. కంటెంట్ బాగుంటే.. ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారనే విషయం ‘అఖండ’లో ప్రూవ్ చేసారు. ఒక రకంగా బాలయ్య ‘అఖండ’ సక్సెస్‌తో మిగతా హీరోలు ఊపిరి పీల్చుకొని తమ సినిమాలు రిలీజ్ చేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…