Rakesh Master : టాలీవుడ్‌లో మంచి కొరియోగ్రాఫర్‌గా మారిన రాకేష్ మాస్టర్ కొద్ది రోజల క్రితం ఆకస్మిక మరణం చెందారు.యూట్యూబ్‌లో అప్పటి వరకు చాలా సందడి చేసిన రాకేష్ మాస్టర్ ఉన్నట్టుండి అనారోగ్యానికి గురి కావడం, ఆ వెంటనే మృతి చెందడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరచింది. రాకేష్ మాస్టర్ ఇటీవల బిగ్ బాస్ షోకు పారడీగా ‘మ్యాన్షన్ హౌస్ మై హౌస్’ అని ఒక రియాలిటీ షోను రాకేష్ మాస్టర్ మొదలుపెట్టారు. అగ్గిపెట్టి మచ్చ, స్వాతినాయుడు, సునిశిత్, ఉప్పల్ బాలు వంటి యూట్యూబ్ స్టార్లతో ఈ షోను నడిపిస్తున్నారు రాకేష్ మాస్టర్. విజయనగరం శివారులోని ఓ రిసార్ట్స్‌లో ఈ షో షూటింగ్ చేశారు. 53 సంవత్సరాలు ఉన్న రాకేష్ మాస్టర్ అనారోగ్యం కారణంగా హైదరాబాద్ వచ్చారు.
అయితే అబ్దుల్లాపూర్ మెట్‌లో నివాసం ఉంటున్న రాకేష్ మాస్టర్‌కి రెండు రోజులుగా రక్తపు విరోచనాలు అవుతున్నాయి. దీతో స్థానికంగా ఉన్న సన్నిహితులు ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేర్చారు. పరిస్థితి విషమించడంతో వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం 5 గంటల సమయంలో రాకేష్ మాస్టర్ తుదిశ్వాస విడిచారు. చిన్న వయస్సలో రాకేష్ మాస్టర్ కన్ను మూయడం ప్రతి ఒక్కరిని బాధించింది. రాకేష్ మాస్టర్ మృతితో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
రాకేష్ మాస్టర్ మరణించిన రోజు బోరబండలోని శ్మశాన వాటికలో జరగాయి. ఈ అంత్యక్రియల కార్యక్రమానికి జనం పెద్ద సంఖ్యలో హాజరు అయ్యారు. రాకేష్ మాస్టర్ శిష్యులైన శేఖర్, జానీలు కూడా ఈ అంత్యక్రియలకు హాజరయ్యారు.అయితే రాకేష్ మాస్టర్ మరణించి వారం రోజులు అవుతున్నప్పటికీ ఇప్పిటకీ వారికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దాదాపు వారం రోజులు పైనే అవుతోంది. ఇక, ఆయనకు సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరణానికి ముందు ఆయన తీసుకున్న చివరి సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ దాదాపు తొమ్మిది నిమిషాల పాటు ఆ వీడియోను చిత్రీకరించారు.
తాను ఆస్ట్రేలియాలో ఉన్నట్లు ఆయన తెలిపారు. అక్కడ ఎండలు బాగా ఉన్నాయని అన్నారు. తాను మందులో లేనని, నీరసంలో ఉన్నానని ఆయన తెలిపారు. ఉప్పల్ బాలు, వైజాగ్ సత్యల మీద కూడా కామెంట్లు చేశారు. వైజాగ్ సత్య చాలా కన్నింగ్‌గా ప్రవర్తిస్తున్నాడని.. అతడి పని చెబుతానని అన్నారు. వీడియో చివరల్లో ఓ మహిళకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. తన కూతరి జోలికి వస్తే నరికేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం రాకేష్ మాస్టర్ వీడియో వైరల్‌గా మారింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…