Jr NTR : ఇప్పటి స్టార్స్ అందరు ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు ప్రకటనలు చేస్తూ బిజీగా ఉన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ దక్కగా, ఆ క్రేజ్ ఉపయోగించుకొని పాపులర్ యాడ్స్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో యాపి ఫిజ్, లీసియస్, కేఎఫ్‌సీ.. లాంటి పలు భారీ బ్రాండ్స్ ఉన్నాయి. కొన్ని రోజుల క్రితమే ఎన్టీఆర్ కేఎఫ్‌సీ యాడ్ చేశారు. ఈ యాడ్ కోసం ఎన్టీఆర్ పారితోషికం కూడా కోట్లల్లోనే తీసుకున్నట్టు సమాచారం. తాజాగా ఎన్టీఆర్ బంగారు, వజ్రాభరణాలు అమ్మే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెల్లరీ కంపెనీకి ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా ఓకే చేశారు.
బ్రాండ్ ఉనికిని మరియు రీచ్‌ను మరింత పటిష్టం చేస్తూ కంపెనీ వినియోగదారుల ప్రచారాల్లో ఎన్టీఆర్ జూనియర్ కనిపించనున్నారు. ఈ అనుబంధానికి అనుగుణంగా, ఎన్టీఆర్ జూనియర్ నటించిన ఆకర్షణీయమైన కొత్త వాణిజ్య ప్రకటన విడుదల చేయబడింది. ఈ యాడ్ సినిమా రేంజ్‌లో ఉంది. ఇందులో ఎన్టీఆర్ చాలా అందంగా కనిపిస్తున్నాడు. యాడ్ కూడా చాలా రిచ్‌గా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ఎన్టీఆర్ తన వ్యక్తిగత విలువలు మరియు బ్రాండ్ యొక్క నైతికత మధ్య సమలేఖనాన్ని నొక్కిచెప్పారు, సహకారాన్ని సహజంగా సరిపోయేలా చేసారు.
ఈ బ్రాండ్ నుంచి కూడా ఎన్టీఆర్ కోట్లల్లో పారితోషికం తీసుకున్నట్టు సమాహారం. ఇలా ఎన్టీఆర్ ఓ పక్క సినిమాలతోనే కాక మరోపక్క వరుస యాడ్స్ తో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా, బాలీవుడ్ లో వార్ 2 సినిమా చెయ్యనున్నాడు ఎన్టీఆర్. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క యాడ్స్ కూడా చేస్తూ బిజీగా ఉన్నాడు. దేవర లో మెయిన్ హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తోంది. అయితే, ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ కి కూడా స్కోప్ ఉందని.. ఈ పాత్రలో మరో క్రేజీ హీరోయిన్ని తీసుకోబోతున్నారని గతంలోనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ సెకండ్ హీరోయిన్ పై మరో గాసిప్ వినిపిస్తోంది. సాయి పల్లవినే ఈ పాత్రలో తీసుకోబోతున్నట్లు టాక్. గతంలో కృతి శెట్టి పేరు కూడా వినిపించింది. మరి ఈ రూమర్ లో ఎంతవరకు నిజం ఉందో చూడాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…