Rajnikanth : ఇటీవల వచ్చిన ఏపీ ఎన్నికల ఫలితాలలో కూటమి విజయ ఢంకా మోగించడం మనం చూశాం. వైసీపీని చిత్తు చేసి కూటమి అఖండ విజయం సాధించింది. అయితే ఈ విజయంతో పవన్ అభిమానులు, చంద్రబాబు అభిమానులు, అలాగే రజినీకాంత్ అభిమానులు సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఇక ఇదే సమయంలో ఏపీలో పలువురు మంత్రులు, మాజీ మంత్రులు ఓటమి పాలు కావడంతో వారు గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆ కోవలో రోజా, కొడాలి నాని నిలిచారు. తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు అప్పట్లో ఒకసారి విజయవాడకి వచ్చారు. రజినీకాంత్, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మంచి స్నేహితులు. ఎన్నో సంవత్సరాలనుంచి వారిద్దరి స్నేహం కొనసాగుతోంది.
రజినీకాంత్ ఎప్పుడూ చంద్రబాబు పరిపాలనని ప్రశంసిస్తూ వుంటారు. అలాగే అప్పట్లో విజయవాడ వచ్చిన రజినీకాంత్ ఎన్టీఆర్ గురించి మాట్లాడారు, అలాగే ఆ తరువాత చంద్రబాబు గురించి ఎంతో గొప్పగా మాట్లాడేరు కూడా. రజినీకాంత్ ఒక అగ్ర నటుడు, తనకన్నా సీనియర్ నటుడు, సహచర నటుడు అని చూడకుండా నటి, అప్పట్లో ఎంఎల్ఏ అయిన రోజా తనిష్టానుసారం నోరు పారేసుకుంది. రజినీకాంత్ కి ఆంధ్ర పాలిటిక్స్ ఏమి తెలుసు అని, రజినీకాంత్ పై ఇష్టానుసారం విమర్శలు చేశారు రోజా. ఆమెతో పాటు అప్పట్లో బూతు పురాణాలు ఎక్కువగా మాట్లాడుతూ వున్న కొడాలి నాని కూడా రజినీకాంత్ పై చాలా విమర్శలు చెయ్యడమే కాకుండా, కనీస గౌరవం ఇవ్వకుండా కూడా మాట్లాడారు.
ఆమెతో పాటు విమర్శలకు దిగారు వైసీపీ ఎమ్మల్యే కొడాలి నాని. తరువాత ఒక సినిమా ఫంక్షన్ లో రజినీకాంత్ ఇలాంటివాళ్లనే ఉద్దేశించి మాట్లాడుతూ, ‘మొరగని కుక్క ఉండదు, విమర్శించని నోరు ఉండదు, ఈ రెండూ లేని ఊరు ఉండదు, అయినా మన పని మనం చేసుకుంటూ పోతూ ఉండాలి. అర్థమైందా రాజా’, అని చెప్పారు. రజినీకాంత్ అన్న మాటలు అప్పుడు వైరల్ అయ్యాయి, మళ్ళీ ఇప్పుడు నెటిజన్స్ అదే వీడియోని పెట్టి వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోలో రోజా, కొడాలి నాని అప్పట్లో చెప్పిన మాటలు, తరువాత రజినీకాంత్ చెప్పిన మాటలు కూడా ఎడిట్ చేసి వీడియోలు పెడుతూ వైరల్ చేస్తున్నారు. కాగా, రోజా, కొడాలి నాని ఇద్దరు ఇటీవల జరిగిన ఎన్నికలలో ఘోరంగా ఓటమి పాలైన విషయం తెలిసిందే.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…