Rajinikanth : యోగి ఆదిత్యనాథ్ పాదాలు మొక్కిన ర‌జ‌నీకాంత్.. వివాదంలో సూప‌ర్ స్టార్..

Rajinikanth : ఇటీవ‌ల జైల‌ర్ సినిమాతో అతి పెద్ద విజ‌యం సాధించిన ర‌జ‌నీకాంత్ దేశంలోని అనేక ప్రాంతాలు చుట్టేస్తున్నారు. ప‌లువురు ప్ర‌ముఖుల‌ని క‌లుస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను నటుడు రజనీకాంత్ క‌లిసి ఆ తర్వాత ఆయ‌న పాదాలను తాక‌డంతో వీడియో వైరల్‌గా మారింది. ఈ చర్యే కొందరికి నచ్చలేదు. ‘‘72 ఏళ్ల వ్యక్తి 51 ఏళ్ల వ్యక్తి పాదాలను తాకడం ఏంటి? మత పరంగా గుడ్డిగా వ్యవహరించినప్పుడే ఇలాంటిది సాధ్యపడుతుంది’’అని అక్షిత్ అనే యూజర్ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు. ‘‘వయసులో 20 ఏళ్ల పెద్ద అయిన రజనీకాంత్ మత విద్వేషాన్ని వ్యాప్తి చేసే సీఎం పాదాలను తాకారు. దక్షిణాది ప్రజలు ఆయనకు ఇచ్చిన గౌరవం రెండు సెకండ్లలో పోయింది. ఫాసిస్టులకు మద్దతు పలికిన వెన్నులేని వ్యక్తిగా చరిత్ర ఆయన్ని గుర్తు పెట్టుకుంది’’అని అమీనా అనే యూజర్ పోస్ట్ చేశారు.

ప్రధానంగా ఎక్కువ మంది యూజర్లు దీన్నే ఎత్తి చూపుతూ రజనీకాంత్ ను తప్పుప‌ట్టారు. అయితే దీనిపై ర‌జ‌నీకాంత్ కూడా వివ‌ర‌ణ ఇచ్చారు. త‌నకు యోగుల పాదాలను తాకే అలవాటు ఉందని అన్నారు. సన్యాసి అయినా, యోగి అయినా.. వారు నాకంటే చిన్నవారైనా సరే.. వారి పాదాలను తాకే అలవాటు నాకు ఉంది’ అని చెన్నై విమానాశ్రయంలో రజనీకాంత్ అన్నారు. సన్యాసిగా శిక్షణ పొందిన యోగి ఆదిత్యనాథ్‌ను 2014లో గోరఖ్‌నాథ్ ఆలయ ప్రధాన పూజారిగా నియమించారు. ఇక ఇదిలా ఉంటే ర‌జనీకాంత్ న‌టించిన జైల‌ర్ చిత్రం మంచి విజ‌యం సాధించి 500 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది.

Rajinikanth touched yogi adityanath feet
Rajinikanth

నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఆగస్టు 11న గ్రాండ్ ’గా విడుదలైంది. తమన్నా హీరోయిన్‌గా చేసింది. ఇక ఈ సినిమా విడుదలైన రోజు నుంచి పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుని వావ్ అనిపించింది. ఎప్పటిలాగే రజినీకాంత్ తన స్టైల్, లుక్స్ అండ్ డైలాగ్స్‌తో వావ్ అనిపించారు. దీనికి తోడు అలరించే థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ రిలీజ్‌పై లేటెస్ట్‌గా ఓ రూమర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమా సెప్టెంబరు 7 నుంచి ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని లేటెస్ట్ టాక్. అంతేకాదు దాదాపుగా ఈ డేట్ ఖరారు అయ్యినట్లు తెలుస్తోంది. తెలుగు తమిళ ఓటీటీ రైట్స్‌ సన్ నెక్స్ట్ కలిగి ఉంది. ఇక హిందీ డబ్బింగ్ నెట్‌ఫ్లిక్స్‌లో అదే రోజు స్ట్రీమింగ్ కానుందని సమాచారం. ఈ విషయంలో అతి త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago