Perni Nani : ఇటీవల నారా లోకేష్ సమక్షంలో టీడీపీ నాయకులు.. వైసీపీ ప్రజా ప్రతినిథులపై దారుణమైన విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పేర్ని నాని తాజా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చంద్రబాబుతో పాటు నారా లోకేష్‌పై మండిపడ్డారు.నారా లోకేష్ పాదయాత్ర ఎలా చేయాలో దివంగత నేత రాజశేఖరరెడ్డి పాదయాత్ర, లేదేంటే జగన్ వీడియోలు చూస్తే అర్థమవుతుందని అన్నారు. యువగళం పేరుతో లోకేష్ రాత్రుళ్లు పాదయాత్ర చేస్తున్నాడు. సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభించి తెల్లవారుజామున ఒంటి గంట వరకు తిరుగుతున్నాడు.యువగళమా? యువ గంగాళమా?. పగలైతే ప్రజలు నిలదీస్తారని అర్థ రాత్రుళ్లు తిరుగుతున్నాడా?? అని ప్రశ్నించారు.
యువగళం వల్ల పేదలకు కొంచెం మంచి జరుగుతోంది. యువగళానికి వచ్చినందుకు ప్రజలకు వెయ్యో, రెండు వేలో వస్తున్నాయి. గన్నవరంలో సభ పెట్టి ముఖ్యమంత్రిని, మా నాయకులను నోటికి వచ్చినట్లు బూతులు తిట్టారు. జుగుప్సాకరంగా, అసహ్యంగా మాట్లాడటమే టీడీపీ నాయకుల రాజకీయం’’ అని పేర్ని నాని నారా లోకేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్ర ఎలా చేయాలో వైఎస్ పాదయాత్ర వీడియోలు చూస్తే తెలుస్తుందని.. జగన్ ఇష్తున్న పథకాలకు పేరు మార్చి ఇస్తామంటున్నారని పేర్ని నాని మండిపడ్డారు. లోకేష్ తోలు తీస్తా, తాట తీస్తా అంటున్నారని.. అలాంటి వారికి అధికారం ఇవ్వాలా అని మాజీ మంత్రి ప్రశ్నించారు.
కప్పులు కడిగేవాడంటే ఇప్పటికీ చంద్రబాబు ప్యాంటు ఎందుకు తడుస్తోందని పేర్ని నాని దుయ్యబట్టారు. మోడీ కప్పులు కడగలేదా అని పేర్ని నాని ప్రశ్నించారు. ఓట్ల కోసం లారీ డ్రైవర్ల భుజాలపై చేతులు వేసి మాట్లాడుతున్నారని.. ఇది పెత్తందారి స్వభావం కాదా అని ఆయన నిలదీశారు. గుడివాడలో తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్ధి లేరని.. లోకేష్‌కు దమ్ముంటే అక్కడ పోటీ చేయాలని పేర్ని నాని సవాల్ విసిరారు. లోకేశ్ అసమర్ధత కారణంగా చంద్రబాబు పవన్ కల్యాణ్‌ను తెచ్చుకోవాల్సి వచ్చిందని చురకలంటించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…