Mohan Babu : హాస్య బ్రహ్మ బ్రహ్మానందం తనయుడి వివాహం ఇటీవల హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ద్వితీయ కుమారుడు సిద్ధార్థ వివాహం శుక్రవారం (ఆగస్టు 18) రాత్రి 10.45 గంటలకు హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నందు గల అన్వయ కన్వెన్షన్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. బూర వినయ్ కుమార్, పద్మజ దంపతుల పుత్రిక ఐశ్వర్య ను బ్రహ్మానందం కుమారుడు సిద్ధార్థ వివాహమాడారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులెందరో హాజరై.. నూతన దంపతులను ఆశీర్వదించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి నందమూరి బాలకృష్ణ, మంచు మోహన్ బాబు, మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్, కోట శ్రీనివాస రావు తదితరులు హాజరయ్యారు.
రాజశేఖర్ జీవిత దంపతులు, రామ్ చరణ్ – ఉపాసన దంపతులతో పాటు చిరంజీవి సతీమణి సురేఖ, పెద్దమ్మాయి సుష్మిత, శ్రీకాంత్ ఫ్యామిలీ, సాయి కుమార్ ఫ్యామిలీ, మంచు విష్ణు దంపతులు, మంచు మనోజ్ దంపతులు… దర్శకులు కోదండరామిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, త్రివిక్రమ్ శ్రీనివాస్, శేఖర్ కమ్ముల.. నటులు రావు రమేష్, ఆలీ ఫ్యామిలీ, ఎల్బీ శ్రీరామ్.. నిర్మాతలు శివలెంక కృష్ణ ప్రసాద్, బెల్లంకొండ సురేష్, అచ్చిరెడ్డి, ఆదిశేషగిరిరావు, కెఎల్ నారాయణ, రఘు బాబు తదితరులు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే మోహన్ బాబు నూతన జంటని ఆశీర్వదించి వెళుతున్న సమయయంలో రామ్ చరణ్ ఉపాసన ఎదురయ్యారు.
ఉపాసనని ఆప్యాయంగా పలకరించారు మోహన్ బాబు. రామ్ చరణ్‌తో కూడా సరదాగ మాట్లాడారు. రామ్ చరణ్, ఉపాసనలు తల్లి దండ్రులు అయిన నేపథ్యంలో వారిద్దరికి కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. గత కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మోహన్ బాబు వారితో సరదాగా మాట్లాడడం అన్ని పుకార్లకి చెక్ పెట్టినట్టు అయింది. ప్రస్తుతం అయితే ఈ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…