Rajini : తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఆయన ప్రమాణ స్వీకారం తర్వాత తొలి ఉద్యోగం రజిని అనే దివ్యాంగురాలు పొందారు. ఈ అరుదైన అవకాశాన్ని దక్కించుకున్న ఆమె గతంలోనే రేవంత్ ను కలిశారు. ఎన్నికలకు ముందు పీసీసీ భవన్ లో కలిసి తన గోడును వెళ్లబోసుకున్నారు. ఆమె విషయంలో చలించిపోయిన రేవంత్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగం ఇస్తానని ఆమెకు హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్లుగానే తన హామీని నిలబెట్టుకున్నారు. కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఆమెకి ఉద్యోగం ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఫైలుపైసంతకం చేసి, రజనికి శాలువా కప్పి, ఆ పత్రాలను ఆమె చేతికిచ్చారు. కార్యక్రమంలో ఆమె కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.
ఆమెకు తెలంగాణ స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజెన్సీ (టీఎస్‌ఎస్ఓసీఏ)లో ప్రాజెక్టు మేనేజర్‌గా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగం కల్పించారు. ఆమెకు నెలకు రూ.50,000 వేతనం అందుతుందని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రజని ఉద్యోగంపై చేసింది రెండవ సంతకం కాగా, మొదటి సంతకం ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించిన ఫైలుపై పెట్టారు సీఎం రేవంత్. రజినీకి అగ్రికల్చర్ కార్పోరేషన్‌లో కాంట్రాక్ట్ పద్దతిలో ఉద్యోగం కల్పించడంతో ప్రశంసలు కురిపించారు.
ఎన్నికలకు ముందు గాంధీభవన్‌లో రేవంత్ రెడ్డిని కలిసిన రజినీ.. తన సమస్యను చెప్పుకుంది. తాను పీజీ పూర్తి చేసినా కూడా ప్రైవేటులో గానీ.. ఇటు ప్రభుత్వంలో గానీ ఎక్కడా ఉద్యోగం రాలేదంటూ వాపోయారు. ఆమె బాధను అర్థం చేసుకున్న రేవంత్ రెడ్డి..త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని.. తప్పకుండా ఉద్యగోం ఇస్తామని చెప్పారు.ఇచ్చిన మాట ప్రకారం.. తాను ప్రమాణస్వీకారం చేసిన రోజే.. రజినీకి ఉద్యోగం ఇచ్చారు రేవంత్ రెడ్డి. రజినీ స్వస్థలం హైదరాబాద్‌లోని నాంపల్లి. వయసు 38. ఆమె తండ్రి పేరు వెంకటస్వామి. కొత్త ప్రభుత్వంలో తొలి ఉద్యోగం ఆమెకే రావడంతో.. కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…