KTR : తెలంగాణ కొత్త ముఖ్య‌మంత్రికి కేటీఆర్ వార్నింగ్.. ప‌థ‌కాలు అమ‌లు చేయ‌క‌పోతే చెప్తాం..

KTR : బీఆర్ఎస్ ఓట‌మి త‌ర్వాత కార్య‌క‌ర్త‌లు, నాయ‌క‌లు తీవ్ర విచారంలో ఉన్న విష‌యం తెలిసిందే. వారిని ఉత్తేజ‌ప‌రిచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు మాజీ మంత్రి కేటీఆర్. సిరిసిల్ల బీఆర్ఎస్ కార్యాల‌యంలో జ‌రిగిన మీటింగ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ‌కు ఉన్న ఏకైక గొంతు కేసీఆర్, బీఆర్ఎస్.. ఆ రెండింటిని ప్ర‌జ‌లు వ‌దులుకోరు అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఇది తాత్కాలిక స్పీడ్ బ్రేక‌ర్ మాత్ర‌మే.. ఇది స్వ‌ల్ప కాలం మాత్ర‌మే అని ఆయ‌న పేర్కొన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని.. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి, నిర్మాణాత్మక ప్రతిపాక్ష పాత్ర పోషిస్తామని కేటీఆర్ తెలిపారు.

అనుకోని ఫలితాలను చూసి నిరాశపడాల్సిన అవసరం లేదని పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పారు. బీఆర్ఎస్ పోరాటాల నుంచి వచ్చిన పార్టీ అని.. ఒడిదొడుకులు కొత్తేమీ కాదని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజా గొంతుకై పోరాడుతామని స్పష్టం చేశారు. ప్ర‌జ‌లు ఇచ్చిన ప్ర‌తిప‌క్ష పాత్ర‌లో కూడా రాణిస్తాం. సిరిసిల్ల‌లో ఓటుకు డ‌బ్బులు, మందు పంచ‌న‌ని ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకున్నాను అని కేటీఆర్ తెలిపారు.ప్రస్తుతం ఇది తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ మాత్రమే అని, ఇది స్వల్ప కాలం మాత్రమే ఉంటుందన్నారు.

KTR warning to new cm revanth reddy on schemes
KTR

కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమ‌లు కోసం ప్ర‌జ‌ల ప‌క్షాన మాట్లాడుతామని కేటీఆర్ చెప్పారు. ప‌వ‌ర్ పాలిటిక్స్‌లో అధికారం రావ‌డం పోవ‌డం స‌హ‌జం. ప్ర‌జ‌లు మ‌న‌కు కూడా రెండు సార్లు అవ‌కాశం ఇచ్చారు. ప్ర‌జ‌లు ఇచ్చిన ప్ర‌తిప‌క్ష పాత్ర‌లో కూడా రాణిస్తామన్నారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాలకే పరిమితమైన విషయం తెలిసిందే. 64 సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతోంది. బీజేపీకి 8, ఎంఐఎంకు 7 సీట్లు వచ్చాయి. కాగా, గురువారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన‌ విషయం తెలిసిందే.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

6 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 day ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago