Rajamouli : 95వ ఆస్కార్ వేడుకలు ఇటీవల అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ సారి ఆస్కార్‌లో నాటు నాటు మెరిసి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకి ఆస్కార్ వచ్చిన నేపథ్యంలో దేశమంతా గర్వంతో ఉప్పొంగిపోతుంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు మాత్రం ఫుల్ ఖుష్ అవుతున్నారు. కాగా, నాటు నాటు పాటకు గాను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ ఆస్కార్ అవార్డును అందుకున్నారు. కాగా ఈ ఆస్కార్ ఈవెంట్‌లో కీరవాణి, చంద్రబోస్‌తో పాటు ఆర్ఆర్ఆర్ హీరోలు రామ్‌చరణ్, ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి, వారి కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నారు.
అయితే ఆస్కార్ వేడుకల్లో పాల్గొన్న ఆర్ఆర్ఆర్ టీమ్ వేర్వేరుగా ఇండియాకు తిరిగివచ్చారు. మార్చి 15న ఎన్టీఆర్ ఇండియాకు రాగా రాజమౌళితో పాటు అతడి ఫ్యామిలీ మెంబర్స్ శుక్రవారం ఇండియా చేరుకున్నారు. రామ్‌చరణ్ కూడా శుక్రవారమే ఇండియాకు వచ్చాడు. అయితే ఆస్కార్ లైవ్ ఈవెంట్‌లో పాల్గొనడానికి రాజమౌళి భారీగానే ఖర్చుచేసినట్లు వార్తలు వస్తున్నాయి. సాధారణంగా విన్నర్స్‌కు మాత్రమే ఆస్కార్ లైవ్ ఈవెంట్‌లో టికెట్స్ కొనుగోలు చేయకుండా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. వారితో పాటు ఒక ఫ్యామిలీ మెంబర్‌ను మాత్రమే ఉచితంగా వేడుకను వీక్షించడానికి అనుమతి ఇస్తారు.
మిగిలిన వారు ఆస్కార్ ఈవెంట్‌ను లైవ్‌గా వీక్షించాలంటే టికెట్ కొనాల్సిందే. ఈ ఏడాది ఒక్కో టికెట్ ధరను ఇరవై లక్షల అరవై వేలుగా ఫిక్స్ చేయగా, రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌తో పాటు మిగిలిన వారందరూ టికెట్స్ కొనుగోలు చేసి ఈ ఈవెంట్‌కి హాజరైనట్టు తెలుస్తుంది. ఆస్కార్ ఈవెంట్ టికెట్స్ కోసం రాజమౌళి దాదాపు కోటి నలభై ఐదు లక్షల వరకు ఖర్చుచేసినట్లు సమాచారం. అది పెద్ద మొత్తమే అయినా తమ సినిమాకు అవార్డును ప్రకటించే క్షణాలను ప్రత్యక్షంగా ఆనందించడం కోసం రాజమౌళి అంత ఖర్చు చేశాడని అంటున్నారు. ఆ మధ్య తమ్మారెడ్డి కూడా ఆస్కార్ కోసం చేస్తున్న ఖర్చుపై విమర్శలు కురిపించిన విషయం తెలిసిందే.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…