Rahul Gandhi : నిత్యం దేశ రాజకీయాల్లో తలమునకలై ఉండే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ న్యూ ఇయర్ సమయంలో కాస్త రిలాక్స్‌డ్‌గా కనిపించారు. కొత్త సంవత్సరం సందర్భంగా వీరిద్దరూ తయారు చేసిన ‘ఆరెంజ్ మార్మలాడ్’ రెసీపీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఆసక్తికరమైన రెసిపీ గురించి.. వారిద్దరు ఇది తయారు చేయడం వెనుక విశేషం ఉంది.ఆరెంజ్ మార్మలాడ్’ రెసిపీ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ రెసిపీని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ స్వయంగా ప్రిపేర్ చేయడం విశేషం. ఇంట్లో ఫ్రెష్‌గా పండిన నారింజ పండ్లతో ఈ రెసిపీని తయారు చేశారు.
నిజానికి ఈ రెసిపీ రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక వాద్రా నుండి నేర్చుకున్నారట. రాహుల్ గాంధీ తన సొంత యూట్యూబ్ ఛానెల్‌లో ఈ రెసిపీ తయారు చేస్తున్న 5 నిముషాల వీడియోను అప్ లోడ్ చేశారు.వీడియోలో సోనియా, రాహుల్ గార్డెన్‌లోని నారింజ పండ్లు తెంపడానికి బాస్కెట్‌తో వెళ్తూ కనిపిస్తారు. బుట్టలోకి తెచ్చిన పండ్లను కిచెన్‌లో క్లీన్ చేసి ఆరెంజ్ మార్మలాడ్ రెసిపీ తయారు చేయడానికి రెడీ అయ్యారు. కిచెన్‌లో ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలో సోనియా తనకు భారతీయ వంటకాలు నేర్చుకోవడానికి చాలా సమయం పట్టిందని.. ముఖ్యంగా కారం తినడానికి చాలా సమయం పట్టిందని చెప్పుకొచ్చింది.
ఇక ఆ తర్వాత జరిగిన సంభాషణలో రాహుల్ మాట్లాడుతూ.. ‘బీజేపీ వాళ్లు ఈ జామ్ అడిగితే వాళ్లకి ఇద్దామా మమ్మీ?’ అని అడిగారు. అందుకు సోనియా ‘వాళ్లు మన మీద విసురుతారు’ అనగానే ఇద్దరు గట్టిగా నవ్వుకున్నారు. రెసిపీ తయారు చేయడం పూర్తి కాగానే దానిని గాజు సీసాల్లోకి నింపుతారు. ‘ప్రేమతో సోనియా, రాహుల్’ అనే బ్రౌన్ పేపర్ మీద రాసిన మెసేజ్‌ను ఆ సీసాలకు అతికించారు. వీడియో మొత్తం కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర క్యాంపెయిన్ లోగో కనిపిస్తుంది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ కాగా, తల్లి కొడుకులు ఇద్దరు కూడా ఇంత సింపుల్‌గా, ప్రేమగా కనిపించే సరికి ప్రతి ఒక్కరు మురిసిపోతున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…