YS Sharmila : కోడలితో మొదటిసారి ఇడుపులపాయలో కనిపించిన ష‌ర్మిల‌..!

YS Sharmila : మ‌రి కొద్ది రోజులలో ష‌ర్మిల త‌న‌యుడు పెళ్లి పీట‌లు ఎక్క‌నున్న విష‌యం తెలిసిందే. అయితే గ‌త కొద్ది రోజులుగా ఆమె పెళ్లి ఏర్పాట్ల‌లో బిజీగా ఉంది. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుటుంబసభ్యులతో కలిసి ఇడుపులపాయకు రీసెంట్‌గా వెళ్లారు. కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియా అట్లూరితో కలిసి వైఎస్సార్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వారి వివాహ మొదటి పత్రికను వైఎస్సార్ సమాధి వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకున్నట్లు షర్మిల తెలిపారు. షర్మిల తల్లి విజయమ్మ, కుమార్తె అంజలి రెడ్డి, ఇతర బంధువులు ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్‌టీపీ విలీనం గురించి స్పందిస్తూ.. తమ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని షర్మిల అన్నారు. తాను కాంగ్రెస్‌తో కలవడానికి సిద్ధంగా ఉన్నానని తేల్చి చెప్పేశారు. దీంతో ఇన్ని రోజులుగా నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడినట్లయ్యింది. ఇడుపుల పాయలోనే షర్మిల బస చేయగా, ఆ తర్వాత మిగిలిన పెళ్లి పనులను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది. వ్యాపార, రాజకీయ రంగాల్లో ఆరితేరిన అట్లూరి కుటుంబంతో షర్మిల వియ్యం అందుకోనున్నారు. ఇక వైఎస్ షర్మిల ఇవాళ మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్లనున్నారు. అక్కడ నుంచి తాడేపల్లిలోని సీఎం నివాసానికి చేరుకోనున్నారు. కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను సోదరుడికి అందజేయనున్నట్లు తెలుస్తోంది. అనంతరం సాయంత్రం విజయవాడ నుంచి షర్మిల ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నట్లు సమాచారం.

YS Sharmila appeared in public with her daughter in law
YS Sharmila

షర్మిల కుమారుడు రాజారెడ్డికి వివాహం నిశ్చయమైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 17వ తేదీన అట్లూరి ప్రియతో కుమారుడి వివాహం నిశ్చయించినట్లు షర్మిల స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ నేపథ్యంలో జనవరి 18వ తేదీన వీరి నిశ్చితార్థ వేడుకను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే. ఈనెల 4న పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఆమెతోపాటు మరో 40 మంది కూడా కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. షర్మిలకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్‌ పెద్దలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago