Anasuya : అందాల ముద్దుగుమ్మ అనసూయ ఇటీవలి కాలంలో సినిమాలు, గ్లామర్ షో కన్నా వివాదాలతోనే ఎక్కువగా వార్తలలో నిలుస్తుంది. ముందుగా వెండితెరపై నటిగా వెలగాలనుకున్న అనసూయకు ఒక స్టాండప్ కామెడీ షో బ్రేక్ ఇచ్చింది. యాంకర్‌గా ‘జబర్దస్త్’లో మంచి ఫేమ్ సంపాదించుకున్న తర్వాత సినిమా అవకాశాలు అనసూయను వెతుక్కుంటూ వచ్చాయి. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ట్రోలర్స్‌కు బ్యాక్ టు బ్యాక్ పంచులు వేసే అనసూయ.. న్యూ ఇయర్ సందర్భంగా ఒక వీడియోను షేర్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
డబ్ స్మాష్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఆమె బూతులతో రెచ్చిపోయింది. ‘2023లో నా వల్ల ఎవరైతే ఇబ్బందిపడ్డారో.. నా మాటల ద్వారా, నా బిహేవియర్ ద్వారా ఎవరినైతే నేను బాధపెట్టానో అంటూ’ కాస్త గ్యాప్ ఇచ్చింది. దీంతో అనసూయ పశ్చాత్తపం పడుతుందని చాలామంది భావించారు. అయితే అదేమీ జరగలేదు. ఎప్పటిలాగే తనదైన శైలిలో తన హేటర్స్‌కు కౌంటర్ ఇచ్చింది. ‘ మీ అందరికీ.. మంచిగయ్యింది. ఇంకొకసారి నా జోలికి రావద్దు. నెక్ట్స్ ఇయర్ కూడా ఇలాగే రిపీట్ చేస్తే మాత్రం దూల తీర్చి దూపమేస్తాను’ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. బహుశా తనను ద్వేషించేవారికి ఇన్ డైరెక్టుగా హెచ్చరికలు జారీ చేసింది అనసూయ.
క్యాప్షన్‌లో మాత్రం ‘నేను జోక్ చేస్తున్నా.. సీరియస్ కాదు’ అని అనసూయ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. నెటిజన్లు క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. రంగస్థలం’ సినిమాతో వెండితెరపై గ్రాండ్‌గా తన కెరీర్‌ను మలుపు తిప్పుకుంది అనసూయ భరద్వాజ్. ఇక తన యాక్టింగ్‌కు ఇంప్రెస్ అయిన దర్శకుడు సుకుమార్.. తన తరువాతి సినిమా ‘పుష్ప’లో కూడా అనసూయకు ఒక కీలక పాత్రను ఇచ్చాడు. అప్పటినుంచి అనసూయకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఏడాదికి కనీసం ఒకట్రెండు సినిమాలు చేస్తూ.. బిజీ అయిపోయింది. అందుకే బుల్లితెరను కూడా పూర్తిగా వదిలేసింది. ప్రస్తుతం అనసూయ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ‘ఫ్లాష్‌బ్యాక్’ అనే తమిళ చిత్రంతో పాటు ‘పుష్ప పార్ట్ 2’లో కూడా నటిస్తోంది అనసూయ.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…