Kalyan Ram : 2024 ఎల‌క్ష‌న్స్‌లో అన్న‌ద‌మ్ములు ఎటువైపు.. క‌ళ్యాణ్ రామ్ ఆన్స‌ర్‌..

Kalyan Ram : ప్ర‌స్తుతం నంద‌మూరి ఫ్యామిలీలో అనేక ఆస‌క్తిక‌ర అంశాలు చోటు చేసుకుంటున్నాయి. బాల‌య్య ఒక‌సైడు, తార‌క్, క‌ళ్యాణ్ రామ్ ఒక‌సైడు అన్న చందాన మారింది. ఇక ఇదిలా ఉంటే క‌ళ్యాణ్ రామ్ న‌టించిన డెవిల్‌ సినిమా గురించి జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదని.. అన్నదమ్ముల మధ్య విబేధాలు రావడం వల్లే ఇలా చేస్తున్నారని రూమర్లు వచ్చినట్టు తాజాగా ఒక ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్‌కు ప్రశ్న ఎదురైంది. దానికి పై విధంగా ఆయన స్పందించారు. తామిద్దరి బంధానికి కొలమానం ఒక ట్వీటు, ఒక ఈవెంట్‌కు రావడం అని ఎవరైనా అనుకుంటే మాత్రం.. మొదట ఆ ఆలోచనను మనసులో నుంచి తీసేసుకోవాలని సూచించారు.

ఇక త‌న కుటుంబంలో ఎవరెవరు ఉన్నారనేది కూడా సుస్పష్టంగా చెప్పేశారు. ఏపీ రాజకీయాలపై మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. 2024లో ఏపీలో ఇప్పటి వరకూ కనీవినీ ఎరుగని ఎన్నికలు జరగబోతున్నాయి. నందమూరి తారక రామారావు ఉన్న సమయంలో కూడా అలాంటి ఎన్నికలు జరగలేదు. ఏపీ ప్రజలు ఓ పెద్ద యుద్ధాన్ని చూడబోతున్న సమయంలో మీరు కూడా చూస్తూనే ఉంటారా లేక ఎటైనా మద్దతిస్తారా అనేది కళ్యాణ్ రామ్‌ను ఓ ప్ర‌శ్న అడ‌గ‌గా, దీనికి సమాధానంగా.. సినిమా వేరు..రాజకీయాలు వేరు, రాజకీయం అనేది ఓ బాల్ గేమ్ లాంటిది. ఈ గేమ్‌లో కళ్యాణ్ రామ్ ఒక్కడి నిర్ణయమే ఉండదు.

Kalyan Ram interesting answer about their stand
Kalyan Ram

ఇది ఓ ఫ్యామిలీ విషయం. ఏ నిర్ణయం తీసుకున్నా కుటుంబంగానే తీసుకుంటాం. ఎటు ఎలా ప్రయాణించాలన్నా కలిసి నిర్ణయం తీసుకున్న తరువాత అటే వెళ్తాం అని చెప్పాడు. ఫ్యామిలీ అంటే మీరు, జూనియర్ ఎన్టీఆర్ అని అనుకోవాలా అనే మరో ప్రశ్నకు…ఫ్యామిలీ అంటే నేను తారక్ మాత్రమే. ఇంకెవరూ లేరు. కట్టకాలేవరకూ ఇద్దరం అన్నదమ్ములుగా ఒక కుటుంబంగా కలిసి ఉంటామని చెప్పుకొచ్చాడు. అయితే ఎన్నిక‌లు త‌రుముకొస్తున్న స‌మ‌యంలో క‌ళ్యాణ్ రామ్ త‌న తాత పార్టీకి స‌పోర్ట్ అని చెప్ప‌కుండా ఆలోచించి చెబుతామ‌ని అన‌డం తెలుగు త‌మ్ముళ్ల‌కి మింగుడుప‌డ‌డం లేదు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

2 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

2 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

5 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago