ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో బౌలర్స్ కి చుక్కలు చూపిస్తున్న బ్యాట్స్‌మెన్స్‌లో సూర్యకుమార్ యాదవ్ ఒకరు. దాదాపు ప్రతి మ్యాచ్‌లో అద్భుతమైన షాట్స్ ఆడుతూ ఔరా అనిపిస్తున్నాడు. ఈ ఏడాది ఆరంభం నుంచి సూపర్ ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్.. జింబాబ్వే మ్యాచ్‌లో మైదానం నలువైపులా షాట్లు ఆడుతూ ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఆరో స్టంప్ మీదకు వేసిన ఒక ఫుల్‌టాస్ డెలివరీని ఫైన్ లెగ్ దిశగా స్కూప్ షాట్ ఆడాడు. ఆ షాట్ రీప్లేను చూసిన పాక్ మాజీ లెజెండ్ వసీం అక్రమ్ ఆశ్చర్యపోయాడు. సూర్యకుమార్‌ను చూస్తుంటే అతను కచ్చితంగా వేరే గ్రహానికి చెందిన వాడని అనిపిస్తుందని కామెంట్ చేశాడు.
టీ20 ప్రపంచకప్ 2022లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు.దీంతో టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. సూర్య ఆటతీరు చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నాడు రాహుల్ ద్రవిడ్. టీ20 ప్రపంచ కప్ 2022లో ఇప్పటివరకు 225 పరుగులు చేసి భారత జట్టు తరపున రెండవ అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. సూర్య ప్రతి గేమ్ లోనూ టీమ్‌కు అవసరమైనప్పుడు మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడని పొగడ్తలతో ముంచెత్తాడు రాహుల్ ద్రవిడ్. గతం కంటే మరింత మెరుగ్గా ఆడుతున్నాడని, జట్టులో అద్భుతమైన ఆటగాడిగా ఉన్నాడన్నారు.
సూర్య కుమార్ యాదవ్ మంచి స్ట్రైక్ రేటుతో ఉత్తమ ప్రదర్శన ఇస్తున్నాడనటంలో ఎటువంటి సందేహం లేదన్నారు. మంచి స్ట్రైక్ రేట్ తో ఎక్కువ పరుగులు సాధించడం ఏ ఆటగాడికైనా అంత సులభం కాదన్నాడు ద్రవిడ్. సూర్యకుమార్ యాదవ్ ఏ బంతిని ఎలా ఆడాలనేదానిపై స్పష్టతతో ఉంటాడని, తన వ్యూహం తనకు ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఎంతో కృషి ఫలితంగా సూర్యకుమార్ యాదవ్ నేడు ఈ స్థితిలో ఉన్నాడని ప్రశంసించాడు టీమిండియా కోచ్.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…