హీరో విశ్వక్ సేన్ మాస్ కా దాస్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన విషయం తెలిసిందే. ఇటీవలే ఓరి దేవుడా చిత్రంతో ఆడియెన్స్ మెప్పు పొందిన అతను ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే ఇటీవలి కాలంలో విశ్వక్ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రెస్‌గా మారాడు. ఆ మధ్య టీవీ 9 యాంకర్‌తో చిన్నపాటి వివాదం చెలరేగగా, ఇప్పుడు ఏకంగా యాక్షన్ కింగ్ అర్జున్. విశ్వక్ సేన్‌పై పలు సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా అర్జున్.. విశ్వక్ సేన్ గురించి మాట్లాడుతూ.. తనతో సినిమా చేస్తానని చెప్పి షూటింగ్ కి రాకుండా 30 రోజుల లాంగ్ షెడ్యూల్ డిస్ట్రబ్ చేశాడు.
సరే అతను చెప్పినట్టుగానే ఆ షెడ్యూల్ క్యాన్సిల్ చేసి మరో షెడ్యూల్ ప్లాన్ చేస్తే నైట్ వరకు బాగానే ఉండి. మరికొద్ది గంటల్లో షూటింగ్ అనగా షూటింగ్ కి రాలేనని చెప్పి మెసేజ్ పెట్టడం లాంటివి హర్ట్ చేశాయని.. తనతో పాటు తన టీం కూడా ఈ విషయంలో చాలా బాధపడ్డారని అర్జున్ అన్నారు. ఎంతోమంది స్టార్స్ ఇక్కడ ప్రొఫెషనల్ గా పనిచేస్తున్నారని. విశ్వక్ ఇలా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని అర్జున్ అభిప్రాయపడ్డారు. అయితే ఇక్కడ ఓ విషయం ఫిలిం ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తుంది.
రాత్రి వస్తానని చెప్పి, తెల్లవారు ఝామున రాను అని మెసేజ్ పెట్టడం వెనక ఇది కారణమని కొందరు చెబుతున్నారు. ఓ భారీ మల్టీస్టారర్ చేసి పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న ఓ టాప్ హీరో ఇంట్లోనే విశ్వక్ ఆ రోజు నైట్ అంతా వుండిపోవాల్సి వచ్చిందని గాసిప్ లు వినిపిస్తున్నాయి. ఆ కారణం వల్లనే షూటింగ్‌కి డుమ్మా కొట్టారని టాక్. ఇంకొందరు విశ్వక్ అసలు తన సినిమాల షూటింగ్ టైమ్ లే డిఫరెంట్ గా వుంటాయని, లేట్ మార్నింగ్ వెళ్లి, ఈవెనింగ్ క్లోజ్ చేస్తారని అంటున్నారు. అయితే తాజాగా విశ్వక్ సేన్ వివాదంపై స్పందిస్తూ.. ఎవరెవరో తన గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని. ఎవరైనా సరే తన ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడితే అందరికి సమాధానం ఇస్తానని అన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…