Raghavendra Rao : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను దిగ్గజ దర్శకుడు, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తప్పుబట్టారు. ఒక విజనరీ లీడర్ అయిన చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం అప్రజాస్వామికం అని ఆయన ధ్వజమెత్తారు. తన ట్విట్టర్‌లో రాఘవేంద్రరావు…‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యింది. ఒక విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానం అప్రజాస్వామికం. ఏపీలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలన్నీ కూడా తాను రాసిన రాజ్యాంగం చచ్చిపోతున్నందుకు బాధ పడుతున్నాయి’ అని కె.రాఘవేంద్రరావు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
చంద్రబాబు అరెస్ట్‌పై దర్శకేంద్రుడు స్పందించడాన్ని వైసీపీ శ్రేణులు వైల్డ్‌గా రియాక్ట్ అవుతున్నాయి. 100కు పైగా సినిమాలు తీసిన ఒక దిగ్గజ దర్శకుడిపై అత్యంత దారుణంగా కామెంట్లు చేస్తున్నారు వైసీపీ అభిమానులు. బండబూతులు తిడుతున్నారు. వార్తలో రాయలేనటువంటి పరుష పదజాలం, బూతులతో విరుచుకుపడుతున్నారు. ‘అంబేద్కర్ విగ్రహాలన్నీ బాధపడతాయి’ అని రాఘవేంద్రరావు పేర్కొన్న లైన్‌ను అండర్‌లైన్ చేసి ట్రోల్ చేస్తున్నారు. ‘పోనీలే రామారావు విగ్రహాలన్నీ హ్యాపీగా ఫీలవుతాయి’ అంటూ ఎగతాళి చేస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు నాయుడు అరెస్ట్ సోషల్ మీడియాలో టీడీపీ, వైసీపీ మధ్య వార్‌కు దారితీసింది.
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును అరెస్ట్ చేసిన ఘటనను అరెస్ట్ చేసిన విధానాన్ని టీడీపీ నాయకులు, ఆయన మద్దతుదారులు ఖండిస్తున్నారు. కమ్యూనిస్టులతో పాటు ప్రజాసంఘాల నాయకులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సహా పలువురు చంద్రబాబు అరెస్ట్ తీరును ఖండిచారు.చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీలో పలు జిల్లాల్లో టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. టీడీపీ కార్యకర్తలు ఆందోళనలు చేయకుండా ఎక్కడిక్కడే పోలీసులను భారీగా మోహరించారు. అయినా పలు ప్రాంతాల్లో కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. చంద్రబాబును విజయవాడకు తరలిస్తున్న రోడ్లపై టీడీపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…