Raghava Lawrence : చిత్ర పరిశ్రమలో మోస్ట్ అండ్ మల్టీ టాలెంటెడ్ కలిగిన అతి కొద్ది మందిలో రాఘవ లారెన్స్ ఒకరు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సైడ్ డ్యాన్సర్‌గా సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆయన నటుడిగా, డైరెక్టర్‌గా, డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా, నిర్మాతగా తన సత్తా చాటుతున్నారు. సొంత సినిమాలు చేస్తూ.. వేరే దర్శకుల సినిమాల్లోనూ పని చేస్తూ వచ్చిన లారెన్స్ ఇప్పుడు హీరోగా కూడా సత్తా చాటుతున్నాడు. అయితే లారెన్స్ రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోను హీరో అనిపించుకుంటున్నాడు. లారెన్స్ ఇప్పటి వరకు ఎన్నో సహాయ కార్యక్రమాలు అందించారు. అవసరం ఉన్న వారికి సాయపడుతున్నారు. కేవలం నిరుపేదలకే కాదు.. చిత్ర పరిశ్రమలోని వారికి కూడా తన వంతు సహాయసహకారాలు అందిస్తున్నారు.
ఇటీవల విజయ్‌కాంత్ కుమారుడి సినీ జీవితం కోసం తన వంతు సాయం చేస్తానని అన్నారు. ఈ మేరకు ఆయన తన ట్విటర్ ఖాతాలో ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు. షణ్ముఖ పాండి సినిమా రిలీజ్ టైంలో ప్రమోషన్లకు ఎంత ఖర్చు అయినా సరే నేను చూసుకుంటాను. వాళ్లు ఒప్పుకుంటే.. అతడి సినిమాలో గెస్ట్ రోల్, సాంగ్, ఫైట్ ఏదో ఒకటి చేస్తాను. విజయ్‌కాంత్ ఎంతో మంది హీరోలకు సాయం చేశారు. అలాంటి ఆయన పిల్లలకు సాయం చేయాలి’’ అని అన్నారు. లారెన్స్ మంచి తనంపై చాలా మంది ప్రశంసలు కురిపించారు. ఇక లారెన్స్‌కి ఒక అబ్బాయి ఉండగా, తనకి సంబంధించిన ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
నా మిత్రులకి, ఫ్యాన్స్ అందరికి నమస్కారం. నేను నాటిన విత్తనం ఇప్పుడు చాలా ఎదిగింది. అతడి పేరు శ్యామ్. అతడు ప్రస్తుతం కాలేజ్‌లో 3వ సంవత్సరం చదువుతూ పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. గత పది సంవత్సరాలుగా హెప్సిబా అనే అమ్మాయి చదువు కోసం ఆర్థిక సాయం కూడా చేస్తున్నాను. రాయపురంకి చెందిన హెప్సిబా చిన్నప్పటి నుంచి తన అమ్మమ్మ దగ్గరే ఉండి చదువుకుంటుంది. అయితే ఈసారి హెప్సిబా స్కూల్ ఫీజును శ్యామ్ చెల్లించబోతున్నాడు అంటూ లారెన్స్ సంతోషకరమైన వార్త చెప్పాడు.. ఈ సంతోషకరమైన క్షణాన్ని మీ అందరితో పంచుకోవడం ఒక తండ్రిగా గర్వంగా.. చాలా ఆనందంగా ఉందని, శ్యామ్‌కు మీ అందరి ఆశీస్సులు కావాలి అంటూ రాఘవ లారెన్స్ చాలా ఎమోషనల్‌గా రాసుకొచ్చాడు. ప్రస్తుతం వీడియో వైరల్ అవుతుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…