Manchu Lakshmi : రామ్ చ‌ర‌ణ్ ఇంట్లో కొన్నాళ్ల పాటు సీక్రెట్‌గా ఉన్నాను.. మంచు ల‌క్ష్మీ ఆస‌క్తిక‌ర కామెంట్స్

Manchu Lakshmi : మోహ‌న్ బాబు త‌న‌య మంచు ల‌క్ష్మీ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. న‌టిగా, నిర్మాత‌గా, హోస్ట్‌గా అద‌ర‌గొట్టిన ఈమె ఇప్పుడు అంత‌గా ఆఫ‌ర్స్ అంది పుచ్చుకోలేక‌పోతుంది. ఈ అమ్మడు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ ర‌చ్చ చేస్తుంది. ఇక ముంబైకి మ‌కాం మార్చిన ముద్దుగుమ్మ ప‌లు ఇంట‌ర్వ్యూలు ఇస్తూ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఆఫర్ల కోసం ట్రై చేస్తుంది మంచు లక్ష్మి. ఇటీవలే యక్షిణి సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా మంచు లక్ష్మి బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

“ముంబైకి నేను షిఫ్ట్ అయినప్పుడు అక్కడ ఉండటానికి నాకు అపార్ట్‌మెంట్ అంటూ ఏది లేదు. దాంతో రామ్ చరణ్ ఇంట్లోనే ఉన్నాను. ఈ విషయం నేను ఎవరికీ చెప్పలేదు. ఎందుకంటే ఒకవేళ చెబితే మీరు రామ్ చరణ్ ఇంట్లో ఉంటున్నారు కదా.. మీకు పని చేయాల్సిన అవసరం ఏంటని అంటారు.. దుకే నేను రామ్ చరణ్ ఇంట్లో సీక్రెట్‌గా ఉన్నాను. నేను ఇక్కడ ఉంటున్నట్లు ఎవరికీ చెప్పొద్దని చరణ్‌కి కూడా చెప్పాను. దానికి అతను నేనెందుకు చెబుతాను అన్నాడు. కానీ, నా నోరు ఆగదు కదా. ఇప్పుడు నేనే చెప్పేశా. కానీ, అంత అందమైన ఇంట్లో ఉండటానికి నాకు మనసొప్పలేదు. దీంతో నేను వెళ్లిపోతానని చెప్పాను. కానీ, నీకు నచ్చినన్నీ రోజులు నా ఇంట్లో ఉండమని చరణ్ చెప్పాడు. అలా ఎన్ని రోజులు ఉన్నానో కూడా చరణ్‌కి తెలీదు” అని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చారు.

Manchu Lakshmi interesting comments on ram charan home
Manchu Lakshmi

ఇటీవల యక్షిణి అనే తెలుగు హారర్ వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్లేక్షకుల ముందుకు వచ్చారు మంచు లక్ష్మీ. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 6 ఎపిసోడ్స్‌తో స్ట్రీమింగ్ అవుతోన్న యక్షిణి వెబ్ సిరీసులో మంచు లక్ష్మీ జ్వాల పాత్రలో నటించారు.. మంచు – మెగా ఫ్యామిలీ అనుబంధం గురించి తెలిసిందే. వీరి మధ్య ఉన్న స్నేహంతోనే మంచు లక్ష్మి చరణ్ ని అడిగి తాను ముంబైలో అపార్ట్మెంట్ తీసుకునేవరకు అక్కడ చరణ్ ఇంట్లో ఉంది. సినీ ఇండస్ట్రీలోని 142 మంది ఆర్టిస్టులతో ఓ వాట్సాప్ గ్రూప్ ఉందని కూడా మంచు లక్ష్మీ చెప్పారు. ఆ వాట్సాప్ గ్రూప్‌లో రామ్ చరణ్, రానా దగ్గుబాటితోపాటు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారని, తమ సినిమా టీజర్, ట్రైలర్ వచ్చినప్పుడు ఆ గ్రూప్‌లో షేర్ చేస్తుంటారని, అలా అందరూ తమ పర్సనల్ అకౌంట్స్‌లో సినిమాలను షేర్ చేస్తూ ప్రమోట్ చేస్తుంటామని మంచు లక్ష్మీ మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 month ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 month ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago