Radha Manohar Das : నాగ చైతన్య-సమంత విడాకులతో ఒక్కసారిగా వార్తలలో నిలిచిన ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి.ఆయన ఈ మధ్య కాలంలో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ తెగ వార్తలలో నిలుస్తున్నాడు.తనపై ఎన్ని నెగిటివ్ కామెంట్లు వచ్చినా పట్టించుకోకుండా విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. అయితే వేణు స్వామి తిరుమల కొండపై జగన్ సీఎం అవుతాడని కామెంట్ చేశారు. దీనిపై మీ స్పందన ఏంటని అడగగా, రాధా మనోహర్ దాస్ ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. జ్యోతిష్యం అనేది ఓ శాస్త్రం. దాని ఆధారంగానే చాలా నిర్ణయించారు. నవమి, చైత్ర మాసం అనేవి కూడా జ్యోతిష్యం వల్లనే. కాని అవి పడకూడని వాళ్ల వల్ల నాశనం అవుతుంది.
సైన్స్ లేక ముందే మనోళ్లు జ్యోతిష్యంతో చాలా చెప్పారు. సెన్స్ ఉంది, సైన్స్ ఉంది. వ్యక్తిగత ఫేమ్ నేమ్ కోసం కొందరు జ్యోతిష్యాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. చరిత్రలో ఎవరు త్యాగం చేశారో వారు ఉన్నారు. దోచుకున్నవాళ్లు ఎప్పుడైన దిక్కు లేని చావు చస్తాడు అంటూ వేణు స్వామి గురించి సీరియస్‌గా మాట్లాడారు. ఇక అప్పుడే పుట్టిన ఊహ తెలియని చిన్నారి జాతకాన్ని వేణుస్వామి వీడియో ద్వారా వెల్లడించడంపై కూడా మండి పడ్డారు రాధ మనోహర్. పసిపిల్ల పుట్టిందంటే సంతోషించాలని ఆయన చెప్పుకొచ్చారు.రామ్ చరణ్ ఒక ఊరిలో శివునికి సేవ చేస్తారని ఆ శివ సేవా ఫలం వల్ల వాళ్లింట్లో అమ్మవారే జన్మించారని నేను భావిస్తున్నానని ఆయన కామెంట్లు చేశారు.
చిరంజీవి కుటుంబ సభ్యులు సైతం ఇంటికి అమ్మవారు వచ్చారనే భావిస్తారని జ్యోతిష్కుడు వెల్లడించారు..పెళ్లైన పదేళ్ల తర్వాత ఆ ఇంటికి అమ్మవారు వచ్చారని ఆ చిన్నారి జాతకం చిన్నారి కుటుంబ సభ్యులకు వేణుస్వామి చెబితే సరిపోతుందని ఆయన కామెంట్లు చేశారు.అలా జాతకం బయటకు చెప్పకూడదని సెలబ్రిటీల పిల్లలు కాబట్టి ఆ ఇంగితం అనేది లేకుండా కొంతమంది జ్యోతిష్కులు ప్రవర్తిస్తారని రాధా మనోహర్ దాస్ వెల్లడించారు.చేసే వృత్తిని బట్టి కులం ఉంటుందని ఆరాధనను బట్టి మతం ఉంటుందని ఆయన తెలిపారు.వేణుస్వామి చెప్పిన విషయాలలో చాలా విషయాలు నిజం కాలేదని కొంతమంది చెబుతున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…