R Narayana Murthy : రజాకార్ ప్రీ రిలీజ్ లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి కి మధ్య వాగ్వాదం జరిగింది. పైడి రాకేశ్ రెడ్డి చెప్పిన విషయాలతో విబేధించిన నారాయణమూర్తి స్టేజ్ మీదకు వెళ్లి ఆయనతో వాగ్వాదానికి దిగారు.పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి పుష్ప సినిమా గురించి ప్రస్తావించారు. సాయిరామ్ శంకర్ హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్న ‘వెయ్ దరువెయ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన ఆర్ నారాయణమూర్తి ఆ సినిమా గురించి మాట్లాడుతూ, ఆ సినిమాని పుష్పలాగా హిట్ అవ్వాలంటూ.. ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ గారు ప్రపంచాన్ని తగ్గేదేలే అంటూ దడదడలాడించేశారు. మన అందరం కూడా ఆయన్ని తగ్గేదేలే అంటూ ఇమిటేట్ చేసాము అని అన్నారు.
ముందుగా ప్రీరిలీజ్ ఈవెంట్ కు రాకేశ్ రెడ్డి హాజరయ్యారు. స్టేజీపై మాట్లాడారు. రజాకార్ సినిమా కాదని నిజమైన చరిత్ర అని పేర్కొన్నారు. ఈ సినిమాలో నటించిన వారి కాళ్లు కడికి తలపై పోసుకోవాలని అన్నారు.రజాకార్ అనేది కొంత మందికి కేవలం సినిమా మాత్రమే కావొచ్చు.. కానీ తమకు తమ ఐదు తరాల పూర్వీకుల నరకయాతన అని వివరించారు. లక్షల మందిని చంపిన నిజాం రాజును రాజ్ ప్రముఖ్ గా నాటి ఢిల్లీ పాలకులు ప్రకటించారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా హిందువులా బతకాలంటే రజాకార్ మూవీ చూడాలన్నారు. ఇది గతం కాదని మనందరి భవిష్యత్ అని స్పష్టం చేశారు.
ఆ సమయంలో మూర్తి స్టేజీ పైకి వచ్చారు. నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎవరికీ తలవంచలేదని కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు శిరస్సు దించారని నారాయణ మూర్తి గుర్తు చేశారు. గతంలో గుజారాత్ లోని జూనాఘట్, తెలంగాణను భారత్‌లో కలిపి ఉండక పోతే నేడు ప్రజాస్వామం ఉండేది కాదని చెప్పారు. భారత్ నుంచి హిందువులు వెళ్లిపోతుంటే వచ్చే ఐదేళ్లు కూడా బీజేపీ 400 ఎంపీ సీట్లతో పాలన చేస్తుందని ప్రధాని మోడీ అంటారా? అని రాకేశ్ రెడ్డిని ప్రశ్నించారు. దేశంలో ఎవరు ఎవరిని పంపేది లేదన్నారు. చట్టాలు అందరికీ సమానం అని స్పష్టం చేశారు. విభిన్న మతాలు, జాతులతో కూడిన దేశమే భారత్ నారాయణ మూర్తి స్పష్టం చేశారు. మత పిచ్చి వద్దని కోరారు. హిందూ ముస్లిం బాయి, బాయి అని అందరూ కలిసి ఉండాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఆర్ నారాయణ మూర్తి వద్ద ఉన్న మైక్ రాకేష్ రెడ్డి లాగేసుకున్నారు. ఆ వెంటనే మైక్ తీసుకున్న ఆర్ నారాయణ మూర్తి.. యే తమ్ముడు.. మాట్లాడితే జైశ్రీరామ్ అంటున్నావు.. శ్రీరాముడు ఒకరి అబ్బ సొత్తు కాదని స్పష్టం చేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…