Harmanpreet Kaur : ప్రస్తుతం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఆసక్తికరంగా సాగుతున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా గుజరాత్ జియాంట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 7 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జియాంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబై 19.5 ఓవర్లలో 3 వికెట్లకు 191 పరుగులు చేసింది. మ్యాచ్ మొత్తంలో ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (48 బంతుల్లో 95 నాటౌట్) బ్యాటింగ్ మెయిన్ హైలైట్ అని చెప్పాలి. సంచలన బ్యాటింగ్‌తో రెచ్చిపోయిందామె. ఆకాశమే హద్దుగా బౌండరీలు, సిక్సులతో విరుచుకుపడుతూ సింగిల్ హ్యాండ్‌తో టీమ్‌ను గెలిపింది. ఒక దశలో మ్యాచ్ జియాంట్స్దేనని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ ఆ టైమ్‌లో సంచలన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్టు బౌలర్లపై విరుచుకుపడింది హర్మన్.
ముంబై గెలుపునకు చివరి 4 ఓవర్లలో 64 పరుగులు కావాలి. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. కానీ ఓవర్‌కు 16 పరుగుల చొప్పున చేస్తే గానీ గెలిచే పరిస్థితి లేదు. నిలకడగా అంత రన్స్ చేయడం సులువు కాదు. వేగంగా ఆడే క్రమంలో వికెట్లు కోల్పోతే మొదటికే మోసం వస్తుంది. ఆ టైవలో హర్మన్ బౌండరీల కంటే సిక్సులు బాదేందుకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చింది. ఈ ఇన్నింగ్స్‌లో ఆమె బ్యాట్ నుంచి ఏకంగా 10 బౌండరీలతో పాటు 5 భారీ సిక్సులు వచ్చాయి. దీన్ని బట్టే హర్మన్ బ్యాటింగ్ విధ్వంసం ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఓవర్‌కు ఎంత రన్స్ కొట్టాలనేది క్యాలిక్యులేట్ చేసుకుంటూ తన బ్యాట్‌ను ఝళిపించింది హర్మన్‌ప్రీత్. అలా చివరి వరకు నిలబడి మ్యాచ్‌ను ఫినిష్ చేసి ముంబైకి మర్చిపోలేని విజయాన్ని అందించింది.
ముంబై ఇండియన్స్ 19.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(48 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో 95 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్ చేసింది. అయితే ఓ దశలో హర్మన్‌ప్రీత్ 21 బంతుల్లో 20 పరుగులే చేసింది. అనంతరం బ్యాటును ఛేంజ్ చేసిన తర్వాత విజృంభించింది. బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించింది. దీంతో మ్యాచ్ అనంతరం బ్యాటును మ్యాచ్ రిఫరీ చెక్ చేశారు.అయితే బ్యాటు మార్చుకోవడానికి గల కారణాలను హర్మన్‌ప్రీత్ వివరించింది. ” ప్రాక్టీస్‌లో ఉపయోగించే బ్యాటుతో మ్యాచ్ ఆడాను. సాధారణంగా మ్యాచ్‌లో నేను ఆడే బ్యాటు ఇది కాదు. అయితే బ్యాటు గ్రిప్ కాస్త జారుతున్నట్లుగా అనిపించడంతో బ్యాటును మార్చుకున్నాను. ప్రాక్టీస్ చేసే బ్యాటుతో ఆడాలని నిర్ణయించుకున్నాను. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం రిఫరీ నా బ్యాట్‌ను చెక్ చేశారు. నా బ్యాటులో ఏమైనా ఉందేమో అని పరిశీలించారు” అని హర్మన్‌ప్రీత్ పేర్కొంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…