Lambasingi Movie Review : లంబ‌సింగి మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందో తెలుసా..?

Lambasingi Movie Review : ‘సోగ్గాడే చిన్ని నాయన’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘బంగార్రాజు’ సినిమాలు ప్రేక్ష‌కుల‌ను ఎలా అల‌రించాయో అంద‌రికీ తెలిసిందే. ఆ సినిమాల ద‌ర్శ‌కుడు కళ్యాణ్ కృష్ణ కురసాల ఈసారి స‌మ‌ర్ప‌కులుగా మారారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న తాజాగా నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. ఆయన ఆధ్వ‌ర్యంలో రూపొందించిన చిత్రం ‘లంబసింగి’. ఈ వారం రిలీజ్ అవుతున్న మూవీల్లో ఇది కూడా ఒక‌టి. మార్చి 15వ తేదీన ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇందులో ‘బిగ్ బాస్’ దివి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించ‌గా, హీరోగా భ‌ర‌త్ రాజ్ ఎంట్రీ ఇచ్చారు. ‘కాన్సెప్ట్ ఫిల్మ్స్’ బ్యానర్ పై ఆనంద్ తన్నీరు ఈ చిత్రాన్ని నిర్మించ‌గా, నవీన్ గాంధీ దర్శక‌త్వం వ‌హించారు. ఇక ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చింది, అస‌లు సినిమా ఎలా ఉంది.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

కథ..

వీరబాబు(భరత్ రాజ్) కానిస్టేబుల్ గా సెలెక్ట్ అవుతాడు. లంబసింగి అనే ఊరిలో అతనికి పోస్టింగ్ పడుతుంది. ఆ ఊరిలో బస్సు దిగగానే హరిత(దివి) ని చూసి ప్రేమలో పడతాడు. తర్వాత ఆమె ఓ మాజీ నక్సలైట్ కూతురు అని తెలుస్తుంది. ఆ ఊరిలో నక్సలైట్లుగా ఉన్న చాలా మందికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది. అందులో దివి తండ్రి ఒకరు. అలాంటి వారితో పోలీసులు రోజూ సంతకాలు పెట్టించుకుని వాళ్ళని గమనిస్తూ ఉండాలి. ఈ పని వీరబాబుకి అప్పగిస్తారు. హరితని ప్రేమలో పడేయడానికి అతను కూడా రోజూ ఆమె తండ్రితో సంతకం పెట్టిస్తుంటాడు, అందుకు ఆమె ఇంటికి వెళ్లి వస్తుంటాడు.

Lambasingi Movie Review and rating in telugu
Lambasingi Movie Review

హరిత ఆ ఊరి హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తూ ఉంటుంది. ఓ రోజు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని కాపాడే క్రమంలో హరితకి మరింత దగ్గరవుతాడు వీరబాబు. దీంతో అదే మంచి సమయం అని భావించి హరితకి తన ప్రేమ గురించి చెప్పాలని డిసైడ్ అవుతాడు. ఓ రోజు హరితకి తన ప్రేమని వ్యక్తపరచగా ఆమె అందుకు ఒప్పుకోదు. దీంతో నిరాశకు చెందిన వీరబాబు ఓ రోజు అతను మాత్రమే పోలీస్ స్టేషన్లో డ్యూటీలో ఉండగా కొందరు నక్సలైట్లు దాడి చేసి అక్కడ ఉన్న అక్రమ ఆయుధాలను తీసుకెళ్ళిపోతారు. అందులో గాయపడిన వీరబాబుకి ఊహించని షాక్ ఎదురవుతుంది. ఆ షాక్ ఏంటి? అసలు హరిత తన ప్రేమని ఎందుకు నిరాకరించింది? ఆమె గతం ఏంటి? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ..

‘లంబసింగి’ ఒక ఫీల్ గుడ్ స్టోరీ అనే చెప్పాలి. దర్శకుడు నవీన్ గాంధీ చాలా మంచి పాయింట్‌ను ఎంపిక చేసుకున్నారు. ఫస్ట్ హాఫ్ లో మొదట కొంచెం స్లోగా అనిపిస్తుంది. కానీ తర్వాత వేగంగా కొన‌సాగుతుంది. ఇక హీరోయిన్ ట్రాక్ ను దర్శకుడు చ‌క్క‌గా డిజైన్ చేశారు. కొన్ని వన్ లైన్స్ కూడా బాగా పేలాయ‌నే చెప్పాలి. ఇంటర్వెల్ బ్లాక్ వద్ద వచ్చే ట్విస్ట్ ప్రేక్ష‌కుల‌ను అంద‌రినీ కట్టిపడేస్తుంది. అయితే సెకండ్ హాఫ్‌ను మాత్రం మొదటి నుండి ద‌ర్శ‌కుడు చాలా ఇంట్రెస్టింగ్ గా నడిపించారు. ఎక్కడా కూడా ప్రేక్షకులు ఆలోచనలో పడే టైం ఇవ్వలేదు. స్క్రీన్ ప్లేని కూడా చాలా పక‌డ్బందీగా డిజైన్ చేశార‌నే చెప్పాలి. వీరబాబు, రాజు గారు పాత్రలతో చేయించిన కామెడీ అంద‌రినీ క‌డుపుబ్బా న‌వ్విస్తుంది. అలాగే క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా పెట్టారు. థియేటర్ నుండి బయటకి వచ్చే ప్రేక్షకులు ఒక ఫీల్‌తో వ‌స్తారు అని చెప్పాలి.

సాంకేతిక నిపుణుల పనితీరు..

దర్శకుడు నవీన్ గాంధీ తెర‌కెక్కించిన ‘లంబసింగి’ ఎక్క‌డా బోర్ కొట్టించ‌దు. ఇంటర్వెల్ ఎపిసోడ్, సెకండ్ హాఫ్ ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తార‌నే చెప్ప‌వ‌చ్చు. 2 గంటల 2 నిమిషాల పాటు ప్రేక్షకులు ‘లంబసింగి’ అనే ప్రపంచంలోకి వెళ్లిపోతారు. ఆర్.ఆర్.ధృవన్ అందించిన సంగీతం సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఓ చిన్న సినిమాలో ఇలాంటి పాటలు ఉంటాయని, వింటామని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఒక్కసారి వినగానే ప్రతి పాట ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అవుతుంది. తెరపై కూడా వాటిని కె.బుజ్జి చాలా అందంగా ప్రెజెంట్ చేశారు. అలాగే ఎడిటర్ విజయ్ వర్ధన్ కావూరి ఎడిటింగ్ కూడా బాగుంది.

నటీనటుల విషయానికి వస్తే.. దివి అంటేనే గ్లామ‌ర్ అన్న ముద్ర ప‌డింది. కానీ ‘లంబసింగి’ ద్వారా ఆమెలో కూడా ఒక స‌హ‌జ న‌టి దాగి ఉంద‌ని తెలుస్తుంది. ఆమె హరిత అనే పాత్రలో ఒదిగిపోయింది. ఆమె పాత్రలో ట్విస్ట్‌లు కూడా ఉంటాయి. ఇక హీరో భరత్ కూడా వీరబాబు అనే పాత్రలో చాలా నేచురల్ గా నటించాడు. క్లైమాక్స్ లో ఇతని ఎమోషనల్ పెర్ఫార్మన్స్ తో మంచి మార్కులు వేయించుకుంటాడు. అలాగే కామెడీతో అలరించాడు అని చెప్పాలి. ఇక వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్దన్, అనురాధ, మాధవి, ఈవీవీ, నవీన్ రాజ్ సంకరపు, ప్రమోద్, రమణ, పరమేష్, సంధ్య.. వంటి నటీనటులు కూడా తమ తమ పాత్రల ప‌రిధి మేర‌కు చ‌క్క‌గానే న‌టించారు.

చివరిగా..

‘లంబసింగి’ కచ్చితంగా ప్రతి ప్రేక్షకుడిని అలరిస్తుంది. 2 గంటల 2 నిమిషాల పాటు ఇంకో ప్రపంచంలోకి వెళ్లిపోతారు. కచ్చితంగా ఈ వీకెండ్ కి థియేటర్లలో మిస్ కాకుండా చూసేయండి.

రేటింగ్ : 3/5

Share
editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago