CM Revanth Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ నాయకులపై ఉక్కుపాదం మోపుతున్నారు. మార్పు మార్క్‌తో తెలంగాణ పొలిటికల్ సైన్స్‌లో సరికొత్త అధ్యాయంగా భౌతిక కూల్చివేత శాస్త్రం ప్రవేశపెట్టపడిందా? ఎన్నికలప్రచారపర్వంలో అలా సవాళ్లు ప్రతి సవాళ్లు రీసౌండ్ ఇచ్చాయి. మార్పు మొదలైంది. భూ ఆక్రమణల ఫిర్యాదు నేపథ్యంలో మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీ భవంతులను అధికారులు కూల్చేశారు. కాలేజీలు.. వ్యాపారాలు.. కోట్ల ఆస్తులన్నా సరే మినిష్టర్‌గా బుగ్గ కారులో షికారు చేయడమంటే మల్లన్నకు మహాక్రేజ్ అంటారు ఆయన ఫ్యాన్స్.
భూ ఆక్రమణల ఫిర్యాదు నేపథ్యంలో మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీ భవంతులను అధికారులు కూల్చేశారు. అంతే.. ఎంతో హాట్ హాట్‌గా పంచ్ డైలాగులతో విమర్శలు ఎక్కుపెట్టే మల్లారెడ్డి ఆల్ ఆఫ్ సడెన్‌గా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లారు. మిగతా ఎమ్మెల్యేల మాదిరిగా నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తారనే టాక్ వచ్చింది. కలిస్తే తప్పేంటని.. త్వరలో తాను కలుస్తానని.. ఇద్దరం టీడీపీ కొమ్మలేమని సాంప్రదాయ మార్క్‌తో చిట్‌చాట్‌లో తన మన్ కీ బాత్ చెప్పకనే చెప్పారు మల్లారెడ్డి.తన కుమారుడు భద్రారెడ్డి మల్కాజ్‌గిరి ఎంపీగా పోటీ చేయడం ఖాయమని బల్లగుద్ది చెప్పిన మల్లారెడ్డి.. సడెన్ యూటర్న్ తీసుకోవడం వెనుక మర్మమేంటి? సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో భేటీ వెనుక లోగుట్టు ఏంటీ? సీఎంను కలిస్తే తప్పేంటని ప్రశ్నించడమే కాదు.. రేపోమాపో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తాను కూడా కలుస్తానని ఎంతో మురిపెంగా చెప్పారు.
ఇప్పటికే మంత్రి మల్లారెడ్డిపై సీరియస్ భూవివాదాలు రాజేశాడు రేవంత్ రెడ్డి. తాజాగా మరో వివాదం ఆయన బావమరిది మెడకు చుట్టుకుంది. గుండ్ల పోచంపల్లి మున్సిపల్ పరిధిలోని భూవివాదంలో మంత్రి మల్లారెడ్డి బావమరిది, గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ భర్త ముద్దుల శ్రీనివాస్ రెడ్డితోపాటు 15 మందిపై కేసు నమోదైంది. వారిలో ఎనిమిది మంది మహిళలు ఉండడం విశేషం. ఇద్దరు వ్యక్తులు మొత్తం 10 మందిని రిమాండ్ కు తరలించినట్లు పేట్ బషీరా బాద్ పోలీసులు తెలిపారు. అయితే మల్లారెడ్డికి సంబంధించిన వ్యక్తులు మద్యం సేవించి స్థలంలో ఉన్న కడ్డీలను పడగొట్టి సెక్యూరిటీ సిబ్బందిపై విచక్షణా రహితంగా దాడి చేశారని తమకు అందిన ఫిర్యాదు మేరకు 15 మంది నిందితులపై కేసు నమోదు చేశారు.అందులో 10 మందిని ఇప్పటికే రిమాండ్ కు తరలించామని చెప్పారు. మరో ఐదుగురిలో మంత్రి మల్లారెడ్డి బావమరిది శ్రీనివాస్ రెడ్డి, మల్లారెడ్డి , విద్యాసాగర్ రెడ్డి, నర్సింహారెడ్డిలు పరారీలో ఉన్నారని తెలిపారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…