Actress Jayalalitha : క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న అందాల నటి జయ లలిత. పాత తరం వాళ్లకు బోరింగ్ పాపగా.. టీవీ ప్రేక్షకులకు దుర్గమ్మ (గోరంత దీపం)గా గుర్తిండిపోతుంది. తెలుగుతో పాటు కన్నడ,మలయాళ, హిందీ చిత్రాల్లో నటించింది. 1986 నుండి ఇప్పటి వరకు పరిశ్రమలోనే కొనసాగుతున్న జయలలిత.. బాలకృష్ణ లారీ డ్రైవర్ చిత్రంలో.. బోరింగ్ పంప్ ఓనర్ ‘బోరింగ్ పాప’గా నటించి గుర్తింపు తెచ్చుకుంది. జయలలిత కన్నా ఈ పేరుతోనే అప్పట్లో ఫేమస్ అయ్యింది ఈ నటి. లేడీ విలన్‌గా, గ్లామరస్ పాత్రలో మెప్పించిన ఆమె.. మంచి క్లాసికల్ డ్యాన్సర్ కూడా. లవ్ మ్యారేజ్ చేసుకుని.. అతడి టార్చర్ తట్టుకోలేక పెళ్లైన కొన్నాళ్లకే భర్త నుండి విడిపోయింది.
తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తన తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత తాను హైదరాబాద్ కు వచ్చానని… వరుసగా సినిమాల్లో ఆఫర్లు రావడంతో ఇక్కడే ఉండిపోయానని జయలలిత చెప్పారు. తాను ఎక్కువగా గ్లామర్ పాత్రలే చేశానని…. ఒక రోజు డైరెక్టర్ గదికి రమ్మని పిలిచాడని, లేదంటే సినిమా నుంచి తీసేస్తానని హెచ్చరించాడని తెలిపారు. తాను ఒప్పుకోకపోవడంతో తనను సినిమా నుంచి తీసేశారని చెప్పారు. ఆ తర్వాత కూడా కొందరు తన వెంట పడేవారని… కొన్నిసార్లు తప్పించుకునే దాన్నని, కొన్ని సార్లు తప్పని పరిస్థితుల్లో లొంగిపోయేదాన్నని జయలలిత షాకింగ్ విషయాన్ని వెల్లడించారు.
తాను చెడిపోయినా పర్వాలేదని, ఇంట్లో వాళ్లు బాగుండాలనే అలా చేశానని చెప్పారు. అయితే, అందరూ వాళ్ల అవసరాలు తీర్చుకున్నారే కానీ, తన మీద ప్రేమను చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శరత్ బాబు, తాను ప్రేమించుకున్నామని… పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నామని జయలలిత తెలిపారు. ఆయనను తాను బావ అని పిలిచేదాన్నని చెప్పారు. బిడ్డను కనాలని ప్లాన్ కూడా చేసుకున్నామని తెలిపారు. అయితే, తమ పెళ్లిని ఇండస్ట్రీకి చెందిన వాళ్లే ఆపేశారని చెప్పారు. ఈ విషయాన్ని ఎక్కడా చెప్పలేదని… ఇప్పుడు ఆయన ఈ లోకంలో లేరు కాబట్టే చెపుతున్నానని అన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…