Pushpa Movie : సోషల్ మీడియా ప్రాముఖ్యత పెరిగాక ఎక్కడ ఏది జరిగిన కూడా వెంటనే తెలిసిపోతుంది. అలానే ఏ సినిమా నుండి ఏ క్లిప్ కాపీ చేశారు అనే విషయాన్ని ఇట్టే పసిగట్టేస్తున్నారు. రాజమౌళి తెరకెక్కించిన చాలా సినిమాలకు కూడా కాపీ మరకలు పడ్డాయి. అయితే ఇప్పుడు నాని చేస్తున్న దసరా సినిమాని పుష్పకి కాపీగా తీస్తున్నారంటూ ప్రచారం నడుస్తుంది. పీరియాడికల్ మూవీగా రాబోతున్న దసరా సినిమా నుండి ఆ మధ్య ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ కాగా, ఆ టీజర్ చూసిన ప్రేక్షకులు నాని వర్షన్ పుష్ప అంటూ కామెంట్స్ చేసారు. ‘పుష్ప’లో ఎర్ర చందనం చూట్టూ కథ ఉంటే.. నాని చేసే దసరాలో బొగ్గు చుట్టూ కథ తిరుగుతుంది.
నల్ల బంగారం అని ప్రేమగా పిలిచే బొగ్గు కథ ఆధారంగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ‘దసరా’ సినిమా తీస్తున్నట్టు తెలిసింది. నాని ఇందులో డీ-గ్లామరైజ్డ్‌గా కనిపిస్తారని అంటున్నారు. ఈ కథ గోదావరిఖని దగ్గర జరిగే ఒక పల్లెటూరు దగ్గర మొదలవుతుంది. అందుకోసం నిర్మాతలు దాదాపు 100 ఇళ్లతో ఒక పల్లెటూరునే నిర్మించేశారు. ఇందులోనే మొత్తం షూటింగ్ అంతా జరుగుతుందని అంటున్నారు. దసరా’లో నాని పాత్రకి.. అలాగే ‘పుష్ప’లోని అల్లు అర్జున్ పాత్రకి కొంచెం దగ్గర పోలికలు ఉన్నాయని అంటున్నారు.
సోమవారం కీర్తి సురేష్ బర్త్ డే (అక్టోబర్ 17).. ఈ సందర్భంగా దసరా చిత్ర యూనిట్ సినిమాలో ఆమె చేస్తున్న వెన్నెల ( అనే క్యారెక్టర్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. పోస్టర్‌ను గమనిస్తే అందులో కీర్తి సురేష్ పెళ్లి దుస్తుల్లో నవ్వుతూ చిందులేస్తోంది. అయితే ఇందులో కీర్తి పాత్ర పుష్పలో శ్రీవల్లి పాత్రకి దగ్గరగా ఉందని ట్రోల్ చేస్తున్నారు. పుష్ప 2 లేట్ అయిందని ఎవరు అన్నారు. త్వరలోనే నాని హీరోగా వస్తుందంటూ సెటైర్స్ వేస్తున్నారు. దసరా సినిమాతో నాని ఈసారి తన మాస్ అటెంప్ట్ తో బాక్సాఫీస్ ని షేక్ చేయాలని చూస్తున్నాడు.మరి నాని అనుకున్న రేంజ్ హిట్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి. దసరా మూవీ రా అండ్ రస్టిక్ మూవీగా తెరకెక్కుతోంది. ఇందులో నాని బొగ్గు గనిలో పని చేసే కార్మికుడి పాత్రలో కనిపిస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…