Mohan Babu : మ‌న‌వ‌డితో చిందులేసిన‌ మోహ‌న్ బాబు.. జోష్ మామూలుగా లేదు..!

Mohan Babu : ఏ వేడుక అయిన స‌రే మోహ‌న్ బాబు ఫ్యామిలీ మొత్తం ఆ వేదిక‌పై తెగ సంద‌డి చేస్తూ ఉంటారు. స్టేజ్‌పై ఉన్నంత సేపు అంద‌రి అటెన్ష‌న్ త‌మ‌పై ప‌డేలా చూసుకుంటారు. మంచు విష్ణు నటించిన యాక్షన్ ఫిల్మ్ ‘జిన్నా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్‌గా జ‌ర‌గ‌గా, ఈ ఈవెంట్‌కి మోహన్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్ర‌మంలో మాట్లాడిన మోహ‌న్ బాబు.. ‘ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేశాను. 75 సినిమాల‌ను నిర్మించాను. శివాజీగారి ఫంక్ష‌న్స్‌లో, మా అన్న‌య్య ఎన్టీఆర్‌గారి ఫంక్ష‌న్‌లో , నాగేశ్వ‌శ్వ‌ర రావు ఫంక్ష‌న్‌లో కృష్ణ‌, కృష్ణంరాజు ఫంక్ష‌న్స్‌లో.. అబ్దుల్ క‌లామ్ మా ఇన్‌స్టిట్యూట్‌కి వ‌చ్చిన‌ప్పుడు కూడా ఎవ‌రు నాకు ఏం చెప్ప‌లేదు.

కాని విష్ణు మాత్రం నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి నాన్న మీరు త‌క్కువ‌గా మాట్లాడాలి అని అన్నాడు. బిడ్డ‌ను ప‌ది మందిలో పొగ‌డ‌కూడ‌ద‌నేది శాస్త్రం. విష్ణు ఎంత బాగా న‌టించాడ‌నేది సినిమాలో న‌టించిన వారు, టెక్నీషియ‌న్స్ చెప్పారు. నేను కొత్త‌గా చెప్ప‌నక్క‌ర్లేదు. సినిమా త‌ప్పక విజయం సాధిస్తుంది. చిత్ర యూనిట్ కు ఆల్ ద బెస్ట్ అని చెప్పారు మోహ‌న్ బాబు .ఇక తన స్పీచ్ అనంతరం.. ఈవెంట్ చివరి క్షణాల్లో తన మనవడు అర్వం తో కలిసి స్టేజీపై స్టెప్పులేశారు. ‘నువ్వొస్తావని నేను..’ అనే జానపద పాటకు మనవుడు, మోహన్ బాబు క‌లిసి తెగ చిందులేశారు.

Mohan Babu danced with his grand son video
Mohan Babu

మ‌ధ్యలో అలీ కూడా అర్వంతో కాలు క‌దిపాడు. అనంతరం బుడ‌త‌డు ఒక్క‌డే డ్యాన్స్ చేస్తుండ‌గా, అది చూసి మోహ‌న్ బాబు తెగ సంతోష‌ప‌డ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండటం విశేషం. ఇక జిన్నా విష‌యానికి వ‌స్తే ఈ చిత్రానికి ఈషాన్ సూర్య దర్శకత్వం వహించారు. గ్లామర్ బ్యూటీలు పాయర్ రాజ్ పుత్, సన్నీ లియోన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్ కూడా ముఖ్య పాత్రలో అలరించనున్నారు. అక్టోబర్ 21న ఈ చిత్రం గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago