Karthikeya 3 : ఇటీవలి కాలంలో విడుదలై నేషనల్ వైడ్‌గా మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన చిత్రం కార్తికేయ 2. ఈ సినిమాకి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా భారీగానే కలెక్షన్స్ రాబట్టింది. డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా నార్త్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్ లోనూ ఈ సినిమా సత్తా చాటుకుంది. ఇప్పుడు కార్తికేయ, కార్తికేయ2 చిత్రాలు పెద్ద విజయం సాధించడంతో అందరి దృష్టి కార్తికేయ3పై ఉంది.కార్తికేయ 3 చేస్తారా, చేస్తే ఈ మూవీ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న నిఖిల్ ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
తనను అందరు ఎక్కడికి వెళ్లినా కార్తికేయ 2 సినిమా ఎప్పుడు వస్తుందని అడిగేవారని.. ఇప్పుడు కార్తికేయ 3 గురించి అడుగుతున్నారని చెప్పాడు. అయితే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నేపథ్యంలో ‘కార్తికేయ’ కథ కొనసాగితే, ద్వారక నేపథ్యంలో ‘కార్తికేయ 2’ కథ సాగింది. ఇక ‘కార్తికేయ 3’ కథ అంతా కూడా అయోధ్య నేపథ్యంలో ఉంటుందనే భావిస్తుండగా, ఈ సారి కథ శ్రీరాముడికి సంబంధించిన రహస్యాలతో నడుస్తుందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కార్తికేయ 3 మరొక అద్భుతమైన రహస్యం అని.. ఇది మిమ్మల్ని ఆశ్చర్యపరిచేలా ఉంటుందని, ఎవరు చూడని, వినని ప్రాచీన సాంస్కృతిక చరిత్ర అని తెలిపారు నిఖిల్.
ఈ క్రమంలోనే కార్తికేయ 3 పై బజ్ ఏర్పడింది. కార్తికేయ 3 గురించి మాట్లాడిన నిఖిల్ ఒక వేళ నేను `కార్తికుయ 3` చేయకపోతే అభిమానులు ఏమంటారో తెలియదు కానీ మా అమ్మా మాత్రం నన్ను వదలదు` అని అన్నాడు నిఖిల్. ఇక నిఖిల్ – అనుపమ పరమేశ్వరన్ తో కలిసి ’18 పేజెస్ చిత్రం చేయగా, ఈ మూవీ విడుదలకి సిద్దం అవుతోంది. గీతా ఆర్ట్స్ 2 నిర్మించిన ఈ సినిమాకి సుకుమార్ కూడా నిర్మాణ భాగస్వామి. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్స్ లేవు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…