Pushpa Movie Re Release : పుష్ప 1ది రైస్ సెన్సేషనల్ హిట్ అవ్వడంతో పుష్ప 2 ది రూల్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప ది రైజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా పుష్పలో బన్నీ తగ్గేదెలే మ్యానరిజంకు వరల్డ్ వైడ్ గా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అల్లు అర్జున్ సిగ్నేచర్ స్టైల్ ను అనుకరిస్తూ సెబ్రెటీస్, క్రికెటర్లు కూడా ఇన్ స్టా రీల్స్ చేసిన విషయం తెలిసిందే. ఒక్క తెలుగులోనే కాకుండా విడుదలైన అన్ని భాషల్లోనూ కాసుల వర్షం కురిపించింది. హిందీ ప్రేక్షకులకు సైతం బాగా దగ్గరైన ఈ చిత్రం అల్లు అర్జున్‌ను పాన్ ఇండియా స్టార్‌ను చేసింది.
ఈ సినిమా గతేడాది డిసెంబర్ 17న విడుదలైన సంగతి తెలిసిందే. మరో నెల రోజుల్లో ఈ సినిమా తొలి వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో పుష్ప సినిమాను రీ-రిలీజ్ చేయాలని నిర్ణయించారు. కాకపోతే, అది తెలుగు రాష్ట్రాల్లో కాదు. బన్నీకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కేరళలో పుష్ప సినిమాను మళ్లీ విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 17న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఇ4 ఎంటర్‌టైన్మెంట్ సంస్థ కేరళ వ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో పుష్పను రీ-రిలీజ్ చేయబోతోంది. పుష్ప 1 బ్లాక్ బస్టర్ హిట్ కావడం తో, సెకండ్ పార్ట్ పుష్ప ది రూల్ కోసం మేకర్స్ గట్టి ప్లాన్ చేస్తున్నారు.
ప్రతి ఒక్క విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. పుష్ప1 లో తగ్గేదెలేలే అంటూ చెప్పిన బన్నీ స్లాంగ్ కి విపరీతమైన క్రేజ్ రాగా, ఈ రెండవ పార్ట్ లో కుమ్మేస్తా అనే పదాన్ని వాడనున్నట్లు తెలుస్తోంది. సుకుమార్, బన్నీ, దేవి శ్రీ ప్రసాద్ కాంబో అంటేనే భారీ అంచనాలు ఉంటాయి. వీరి కాంబో పుష్ప మరో సెన్సేషన్ క్రియేట్ చేయడం తో పుష్ప ది రూల్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ దీన్ని నిర్మిస్తుండగా, పుష్ప 2ను 2024 మే లేదా ఏప్రిల్‌లో విడుదల చేద్దామని నిర్ణయించుకున్నారట. పుష్ప2 అభిమానుల అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…