Trivikram Srinivas : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పెద్దగా వివాదాల జోలికి వెళ్లరు అనే సంగతి తెలిసిందే. ఆయన తన పనేదో తాను చేసుకుంటూ ముందుకు సాగుంటారు. అయితే ఆయనపై సీనియర్ హీరోయిన్ ప్రేమ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇవి ఇప్పుడు ఇండస్ట్రీలో చరచ్చనీయాంశంగా మారాయి. దేవి లాంటి చిత్రాలలలో నటించి తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన ప్రేమ… వేణు నటించిన చిరునవ్వుతో సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఇందులో బావతో పెళ్లి వద్దనుకొని మోసం చేసే వ్యక్తితో వెళ్లిపోయే పాత్రలో నటించింది. అయితే ఈ పాత్ర పోషించడానికి కారణం త్రివిక్రమ్ అట.
ఈ చిత్రానికి త్రివిక్రమ్ కథ అందించింది. హీరోయిన్‌గా కాకుండా కీలక పాత్రలో నటించేందుకు ప్రేమ పెద్దగా ఆసక్తి చూపలేదట. కాని.. త్రివిక్రమ్.. ఇది హీరోయిన్ తో సమానమైన పాత్ర అని ప్రేమని ఒప్పించాడట. దీనితో ప్రేమ అనుమానంగానే ఈ చిత్రాన్ని అంగీకరించింది. అయితే షూటింగ్ కి ముందు ఒకలా చెప్పి సినిమాలో వేరేలా చేయించడంతో తర్వాత కూడా తనకు అలాంటి అవకాశాలే వచ్చాయి. ఈ క్రమంలో నా కెరీర్ నాశనం అయింది అంటూ ప్రేమ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రేమ కెరీర్ లోనే దేవి చిత్రం ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంతో ప్రేమకి సరికొత్త క్రేజ్ వచ్చింది.
ఇక త్రివిక్రమ్ విషయానికి వస్తే.. ఈమధ్య కాలంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పీడ్ బాగా తగ్గిపోయింది అని చెప్పాలి. ఎప్పుడో 2020లో అల్లు అర్జున్ తో “అల వైకుంఠపురములో” సినిమా చేశారు త్రివిక్రమ్. సంక్రాంతి సందర్భంగా విడుదలై బన్నీ కెరీర్ లోనే పెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా విడుదలై మూడేళ్లవుతోంది. ఆ తర్వాత ఎప్పుడో “భీమ్లానాయక్” కు త్రివిక్రమ్ డైరెక్టర్ గా కాకుండా స్క్రిప్ట్ రైటర్ గా పని చేశారు. ఇక మూడేళ్ల తర్వాత డైరెక్టర్‌గా మహేష్‌తో సినిమా చేస్తున్నారు. పలు కారణాల వలన చిత్రం వాయిదా పడుతూ వస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…