Producer Chittibabu : టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత ప్రస్తుతం సక్సెస్‌లు లేక కాస్త ఇబ్బంది పడుతుంది. అయితే శాకుంతలం చిత్రం సమంతకి దారుణమైన ఫ్లాప్ అందించింది. ఈ సినిమా ఫ్లాప్ తర్వాత నిర్మాత చిట్టిబాబు ఆమెపై నిప్పులు చెరుగుతూ పలు కామెంట్స్ చేశారు. రీసెంట్ ఇంటర్వ్యూలో సమంతపై చిట్టిబాబు షాకింగ్ కామెంట్స్ చేయడం.. ఆ తర్వాత సమంత పరోక్షంగా స్పందించడం చూసాం. తాజా పరిస్థితులు చూస్తుంటే ఇదే ఇష్యూ చిలికి చిలికి గాలివానలా మారుతోందని అర్థమవుతోంది. చిట్టిబాబు మరోసారి సమంత మీద ఫైర్ కావడం, రివర్స్ కౌంటర్లు వేయడం టాలీవుడ్ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
శాకుంతలం సినిమా మరియు యశోద సినిమా ప్రమోషన్స్ సమయంలో సమంత కన్నీళ్లు పెట్టుకోవడం పై చిట్టిబాబు షాకింగ్ కామెంట్ లు చేశారు. సినిమా ప్రమోషన్స్ కోసం సమంత చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందంటూ వ్యాఖ్యానించారు. డబ్బుల కోసమే పుష్ఫ సినిమాలో ఐటమ సాంగ్ కు స్టెప్పులు వేసిందని ఆయన మండిపడ్డారు. ఇక శాకుంతలం సినిమాలో సమంతకు శకుంతల పాత్ర ఎలా వచ్చిందో అని తనకు ఆశ్చర్యం వేసిందన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలకి సమంత ఇన్‌డైరెక్ట్‌గా కౌంటర్ వేసింది. కొంతమంది చెవుల్లో వెంట్రుకలు ఎలా పెరుతాయి అంటూ గూగుల్ సెర్చ్ చేసిన స్క్రీన్ షాట్ ను షేర్ చేసింది. అంతే కాకుండా గూగుల్ లో టెస్టోస్టిరాన్ హార్మోన్ పెరగటం వల్లనే అలా పెరుగుతాయని కనిపిస్తుంది.
ఇక ఆ ఫోటోకు ఇఫ్ యూ నో యూనో అంటూ క్యాప్షన్ ఇచ్చింది. పచ్చిగా చెప్పాలంటే నిర్మాత చిట్టిబాబు మదంతో ఇలాంటి కామెంట్స్ చేస్తున్నాడని పేరు చెప్పకుండా కౌంటర్ వేసింది. ఆయన పేరు చెప్పకుండా సమంత కౌంటర్ ఇచ్చిన కూడా అది తన గురించే అని భావించిన చిట్టిబాబు సమంతపై నిప్పులు చెరిగాడు. ఆమె గురించి నేను మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదని అన్నాడు. నేను కౌంటర్ ఇస్తే రిప్లై ఇవ్వలేదు…నా వెంట్రుకల గురించి మాట్లాడే బదులు నేను అడిగిన ప్రశ్నల్లో నిజాయితీ గురించి మాట్లాడితే బాగుండేదని ఆయన చెప్పుకొచ్చారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…