Bichagadu Movie : బిచ్చగాడు చిత్రం ఎంత సెన్సేషనల్ హిట్ అయిందో మనందరం చూశాం. కేవలం మౌత్ టాక్‌తోనే ఈ సినిమాకి మంచి క్రేజ్ దక్కింది. 2016లో విడుదలైన బిచ్చగాడు డబుల్ బ్లాక్ బస్టర్. కాగా, ఈ సినిమాతో విజయ్ ఆంటోని కూడా తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. అయితే ఈ చిత్రంలో తాను నటించాల్సి ఉంది, కొన్ని కారణాలతో ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదని శ్రీకాంత్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. బిచ్చగాడు తెలుగు వెర్షన్ శ్రీకాంత్ చేద్దామనుకున్నారట. మహాత్మ చిత్రానికి విజయ్ ఆంటోని మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశాయగా, ఆ సమయంలో శ్రీకాంత్ తో పరిచయం ఏర్పడిందట. ఇద్దరి మధ్య స్నేహం కుదిరిన నేపథ్యంలో బిచ్చగాడు చిత్రాన్ని శ్రీకాంత్ తెలుగులో రీమేక్ చేద్దామని అనకొని నిర్మాత చదలవాడ తిరుపతిరావును కూడా కలిశారట.
శ్రీకాంత్ ఇమేజ్ కి సరిపోయేలా మదర్ సెంటిమెంట్ ఇంకొంచెం పెంచి తెరకెక్కించాలని భావించారు. అయితే బడ్జెట్ లెక్కలు చూశాక నిర్మాత వెనక్కి తగ్గారట. దాంతో బిచ్చగాడు చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసే ప్రణాళిక కార్యరూపం దాల్చలేదట. నాకు రెమ్యూనరేషన్ తో పాటు సినిమా కోసం అనుకున్న దానికన్నా భారీగానే ఖర్చులు రావడంతో ఈ సినిమాని తెలుగులో నిర్మించకుండా కేవలం డబ్ చేసి విడుదల చేశారని తెలిపారు.రెమ్యూనరేషన్ అనుకున్న దానిలో కనుక అయ్యు ఉంటే ఈ సినిమాని తెలుగులో తానే హీరోగా నటించేవాడినని ఈ సందర్భంగా శ్రీకాంత్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం బిచ్చగాడు సినిమాకి సీక్వెల్ రూపొందుతుండగా, ఈ చిత్ర షూటింగ్ లో విజయ్ ఆంటోని ప్రమాదానికి గురయ్యారు. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సక్సెస్ఫుల్ సిరీస్ మీద పరిశ్రమలో ఎన్నో అంచనాలు ఉన్నాయి. అయితే సీక్వెల్ కి శశిని పక్కన పెట్టి తానే దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక శ్రీకాంత్ విషయానికి వస్తే.. ఇక శ్రీకాంత్ సినిమాల విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం పలు సినిమాలలో పలు విలన్ పాత్రలలోను హీరోలకు బాబాయ్, అన్నయ్య పాత్రలలో నటిస్తూ సందడి చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…