Priyamani : రోజురోజుకీ మూగ జీవాలపై దాడులు మరింత పెరుగుతూ పోతున్నాయి. మనిషిలో మానవత్వం చచ్చిపోయి రాక్షసులలా మారుతున్నారు. వాటిని చంపడం, హింసించడమే కాదు నిలువరించుకోలేని కామవాంఛతో లైంగిక క్రీడలకి కూడా పాల్పడుతున్నారు. ఇవి మానవత్వానికి మాయని మచ్చ. సభ్యసమాజం తల దించుకోవాల్సిన ఘటనలు చాలా చూస్తూనే ఉన్నం. పసి పిల్లల నుంచి పండు ముసలి వాళ్లపై అత్యాచారాలకు పాల్పడుతున్న కామాంధులు.. ఆఖరుకు మూగ జీవాలను కూడా వదలడం లేదు.
తాజాగా కామంతో కళ్లు మూసుకుపోయిన బీహార్ రాజధాని పాట్నాకి చెందిన కామాంధుడు కుక్కపై అత్యాచారం చేశాడట. ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు సదరు వ్యక్తి మీద కేసు నమోదు చేశారు. అదుపులోకి తీసుకొని చర్యలు చేపట్టారు. ఈ విషయాన్ని ప్రియమణి ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేస్తూ.. చివరికి కుక్కల్ని కూడా వదలరంట్రా అని ఫైర్ అయ్యారు. ఇది అత్యంత నీచం అంటూ బూతులు తిడుతున్నట్లు తెలియజేసే ఎమోజీలు కూడా షేర్ చేస్తూ తన అసహనం తెలియజేసింది. ఇలాంటి ఘటనలు దేశంలో ఎన్నో జరుగుతుండగా, సెలబ్స్ తమ గొంతు వినిపిస్తున్నారు.
రష్మీ, అమలతోపాటు పలువురు సినీ ప్రముఖులు సైతం మూగ జీవాలపై జరుగుతున్న దాడులపై మండిపడుతున్నారు. వీటికి సంబంధించి కొత్త చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రియమణి విషయానికి వస్తే ఆమె చేతిలో ప్రస్తుతం అరడజనుకు పైగా వివిధ భాషల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నాగ చైతన్య-కృతి శెట్టి కాంబోలో తెరకెక్కుతున్న కస్టడీ చిత్రంలో ప్రియమణి ఒక పాత్ర చేస్తున్నారు. అలాగే షారుక్ ఖాన్ హీరోగా దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న జవాన్ మూవీలో ప్రియమణి కీలక పాత్ర పోషిస్తుంది. ఒకప్పుడు హీరోయిన్‌గా అలరించిన ప్రియమణి ఇప్పుడు సపోర్టింగ్ పాత్రలలో నటిస్తూ మెప్పిస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…