Honey Rose : హనీరోజ్.. ఇప్పుడు ఈ పేరు తెలుగు, మలయాళం ప్రేక్షకులకి చాలా సుపరిచితం. తెలుగులో ఈ అమ్మడు పలు సినిమాలు చేసినప్పటికీ వీరసింహారెడ్డి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది.. వీరసింహారెడ్డి సినిమాతోనే హనీ రోజ్ పేరు టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తోంది. దానికి కారణం హనీరోజ్ తన అంద చందాల తో ప్రేక్షకులను మాయ చేయడమే. సినిమాలోనే కాకుండా సినిమా ఈవెంట్ లలో హనీ రోజ్ సందడి చేస్తుంది.. దాంతో హనీరోజ్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ముద్దుగుమ్మ కు టాలీవుడ్ లో కూడా క్రేజ్ పెరిగిపోయింది. ఈ అమ్మడు 2008లో వచ్చిన ఆలయం అనే సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా లాంచ్ అయింది.
అయితే ఆ సినిమా అంత వర్కౌట్ అవ్వలేదు. తర్వాత ఎక్కువగా మలయాళ కన్నడ తమిళ సినీ పరిశ్రమకు పరిమితమైన ఆమె 2014లో ఈ వర్షం సాక్షిగా అనే మరో సినిమా కూడా చేసింది. అయితే ఈ సినిమా కూడా ఆమెకు ఏమాత్రం కలిసి రాలేదు. 2023 మొదట్లో బాలకృష్ణ హీరోగా వచ్చిన వీరసింహారెడ్డి సినిమాతో ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.. వాస్తవానికి ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ అని ముందు నుంచి ప్రచారం చేశారు. కానీ హనీరోజ్ కూడా ఒకానొక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా చేసిన తర్వాత ఆమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోవటమే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆమెకు చాలామంది అభిమానులుగా మారిపోయారు.
వీరసింహారెడ్డి సినిమా రిలీజ్ తర్వాత నుంచి పూటకో ఫొటో, రోజుకో వీడియో అన్నట్లు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తూనే ఉంది. అలాంటి ఈమె సడన్ గా కొత్త లుక్ లో కనిపించి అందరికీ షాకిచ్చింది. బ్లూ కలర్ మెరుపుల డ్రస్ తో ఉన్న ఫొటోని పోస్ట్ చేసిన హనీరోజ్.. బాబ్డ్ హెయిర్ తో కనిపించింది. ఇది సెట్టింగా లేకుంటే కట్ చేసుకుందా అనే అనుమానాలు అందరి మదిలో మెదులుతున్నాయి. జస్ట్ నెలల వ్యవధిలోనే పూర్తిగా మారిపోయిన హనీరోజ్.. ముందు ముందు ఇంకెలాంటి గెటప్స్ లో కనిపిస్తుందో అని అందరు ఆలోచనలు చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…