Jr NTR : ప్రస్తుతం.. వెండి తెరపై రచ్చ చేస్తున్న హీరో జూనియర్ ఎన్టీఆర్. ఆయన క్రేజ్ ఇప్ప్పుడు ఏ రేంజ్‌లో ఉందో మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆయన క్రేజ్ ప్రపంచ స్థాయికి చేరింది. అయితే సినిమాల్లోకి రాకముందు జూనియర్ ఎన్టీఆర్ సీరియల్‌లో నటించాడా..? అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది. అసలు ఇదెప్పుడు జరిగింది అని చాలా మంది ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే అలాంటి స్టార్ హీరో సీరియల్ చేయడం అంటే మాటలు కాదు. అయితే ఇదంతా జరిగి కొన్నేళ్లవుతుంది. ఈయన సినిమాలలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వకముందు ఓ సీరియల్‌లో నటించాడు. అది కూడా చాలా మందికి తెలియదు.
జూ. ఎన్టీఆర్ బాలనటుడిగా బ్రహ్మర్షి విశ్వామిత్ర, బలరామాయణం వంటి సినిమాల్లో నటించాడు. నిన్ను చూడాలని సినిమాతో హీరోగా అడుగు పెట్టాడు. స్టూడెంట్ నెంబర్ 1 , సింహాద్రి, యమదొంగ వంటి వరస సినిమా హిట్స్ తో టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. బుల్లి తెరపై బిగ్ బాస్, ఎవరు మీలో కోటీశ్వరుడు షోకి హోస్ట్ గా కూడా అదరగొట్టాడు. అయితే ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే బుల్లితెర పై ఓ సీరియల్ లో నటించాడనే విషయం బహుశా కొద్దిమందికి మాత్రమే తెలుసు.. ఈ టీవీ లో ‘భక్త మార్కండేయ’ అనే పేరుతో అప్పట్లో ఓ సీరియల్ ప్రసారమయ్యేది. ఈ సీరియల్ లో లీడ్ రోల్ అయిన మార్కండేయ పాత్రని ఎన్టీఆర్ పోషించాడు. ఎన్టీఆర్ శివుడి భక్తుడిగా చిన్న వయసులోనే చాలా అద్భుతంగా ఆ పాత్రని పోషించాడు.
ఇక రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) మూవీతో భారీ ఇండస్ట్రీ హిట్‌ను కూడా ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు, ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవడంతో పాటు తన రేంజ్‌ను అంతర్జాతీయ స్థాయికి చేర్చుకున్నాడు. ఈ జోష్‌లోనే ఇప్పుడు తన 30వ సినిమాను టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివతో చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ రెడీ అవుతోన్నాడు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్‌తో రూపొందనుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…