Preity Zinta : బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింతా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తెలుగులో పలు సినిమాలు చేసి మెప్పించింది. ప్రస్తుతం అమెరికన్ భర్త జీనీ గుడ్ఎనఫ్ తో కలసి యుఏలో సెటిల్ అయింది. సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మకూడా ఇచ్చింది. అయితే ఎప్పుడు ఐపీఎల్‌లో తెగ సందడి చేస్తూ రచ్చ చేస్తుంది ప్రీతి జింతా. ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ జట్టుకు సహయజమానిగా ప్రీతి వ్యవహరిస్తున్న ప్రీతి జింతాపై ప్రస్తుతం దారుణమైన ట్రోలింగ్ నడుస్తుంది. ప్రీతి జింతా ఎయిర్ పోర్ట్ కు వెళుతున్న సమయంలో ఆమె కారు దగ్గరకి వీల్ ఛైర్ వేసుకుని భిక్షాటన చేస్తూ.. ఓ దివ్యాంగుడు వచ్చాడు.
మేడం ధర్మం చేయండి అంటూ అభ్యర్ధించగా, అదేమి పట్టించుకోకుండా కారులో ఎక్కి కూర్చుంది ప్రీతి. దాంతో కారు ముందుకు పోయింది. అయినా గానీ ఆ వికలాంగ వ్యక్తి కారును అందుకుందామని, ఎంతో కొంత ఇవ్వకపోదా అని దాన్ని కొంత దూరం వెంబడించినప్పటికీ ప్రీతి కారు ఆపలేదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దాంతో సోషల్ మీడియాలో ప్రీతి జింతాపై ట్రోల్స్ వస్తున్నాయి. రూ. 100 కోట్లు పెట్టి ఐపీఎల్ లో జట్టు కొనొచ్చు కానీ.. ఈ వికలాంగుడికి ఇచ్చేందుకు రూ. 100 రూపాయలు కూడా లేవా అని ఆమెని తిట్టిపోస్తున్నారు.
దివ్యాంగుడు అంత దీనంగా అభ్యర్థించిన నీ మనసు కరగలేదా.. ప్రీతి ఎందుకు ఇలా చేశావ్ అంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు. అయితే ప్రీతి జింతా ఇది గమనించి కూడా ఇలా చేసిందా? లేక బ్లాక్ కలర్ గ్లాస్ వల్ల గమనించ లేదేమో అని కొందరు ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. కాగా, ప్రీతి జింతా చిన్నతనంలోనే తన తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యత తన పై వేసుకుంది.పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ముంబైకి వచ్చిన ప్రీతి మోడల్ గా అక్కడ తన కెరీర్ ని మొదలు పెట్టింది. మొదటగా తాను చేసిన లిరిల్ యాడ్‌తో లిరిల్ గర్ల్‌గా క్రేజ్ సంపాదించుకున్న ప్రీతి జింతాకు బాలీవుడ్ లో నటించే అవకాశం స్వయంగా తనను వెతుక్కుంటూ వచ్చింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి మెప్పించింది ప్రీతి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…