Prashanth Kishore : తెలంగాణ ఎన్నికలు ఎంత రసవత్తరంగా మారాయో మనం చూశాం. ఇక ఇప్పుడు ఏపీలో కూడా రాజకీయాలు కూడా మరింత రసవత్తరంగా మారనున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ పరిణామాలు స్పీడ్‌గా మారుతున్నాయి. తాజాగా చంద్రబాబుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. ఈ సారి ఆయన టీడీపీ కోసం పనిచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ భేటీపై అధికారిక ప్రకటన రావడమే తరువాయి అన్నట్లుగా పరిస్థితులు మారాయి. గతంలో పీకే జగన్ నేతృత్వంలోని వైసీపీ కోసం పనిచేసిన విషయం తెలిసిందే. అనూహ్యంగా తెర మీదకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్షమయ్యారు.
గన్నవరంలో ప్రత్యేక జెట్ లో నారా లోకేష్ తో పాటుగా దిగిన ప్రశాంత్ కిషోర్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. 2019 ఎన్నికల్లో జగన్ గెలుపు వెనుక కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ ఈ ఎన్నికల వేళ చంద్రబాబుతో సమావేశం కావటం ఆసక్తి కరంగా మారుతోంది. ఐప్యాక్ వ్యవస్థాపకుల్లో కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ 2014లో ప్రధాని మోదీ విజయంలో ప్రధాన భూమిక పోషించారు. ఆ తరువాత ఢిల్లీలో ఆప్, పంజాబ్ లో కాంగ్రెస్, ఏపీలో జగన్ విజయం వెనుక కీలకంగా వ్యవహరించారు. 2019 ఎన్నికల ముందే జగన్ నాడు ప్రశాంత్ కిషోర్ తో ఒప్పందం చేసుకున్నారు.
జగన్ గెలుపు తరువాత ప్రశాంత్ కిషోర్ దూరంగా ఉన్నా..ఆయన టీం వైసీపీ కోసం పని చేస్తోంది. ఇదే సమయంలో ఐ ప్యాక్ లో పీకే సహచరులుగా ఉన్న రాబిన్ శర్మ ప్రస్తుతం టీడీపీకి..రుషి రాజ్ సింగ్ వైసీపీ కోసం పని చేస్తున్నారు. ఈ సమయంలో కొంత కాలంగా ప్రశాంత్ కిషోర్ కోసం టీడీపీ ప్రయత్నిస్తోందనే వార్తలు వచ్చాయి. కాగా, చంద్రబాబుతో భేటీ అయిన పీకే.. ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పరిస్థితులు, తాను చేసిన సర్వే నివేదికలను వివరిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ద్వారా ప్రశాంత్ కిశోర్‌ను నారా లోకేష్ అప్పట్లోనే కలిశారు. కానీ, సొంత రాష్ట్రం బీహార్‌లో ఆయన జనసురాజ్ పేరుతో పాదయాత్ర చేస్తుండటంతో ఎన్నికల సమయంలో సేవలందిస్తానని హామీ ఇచ్చినట్టు సమాచారం.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…