Prithvi Shaw : ప్రస్తుతం టీమిండియా జట్టులో అవకాశం రావడం చాలా కష్టంగా మారింది. సీనియర్స్‌ని సైతం పక్కన పెట్టి యువ క్రికెటర్స్‌కి అవకాశాలు ఇస్తున్నారు.అయితే ఏ ఆటగాడు అయిన నిలకడగా రాణిస్తేనే అతని కెరీర్ సజావుగా ముందుకు సాగుతుంది. లేదంటే మధ్యలోనే అతడికి చెక్ పెట్టేస్తున్నారు. ముంబైకు చెందిన ఈ యంగ్ క్రికెటర్ పృథ్వీ షా ఊహించని విధంగా భారత జట్టులోకి కూడా వచ్చాడు. కొన్ని మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఐపీఎల్‌లోనూ సత్తా చాటాడు. అతని దూకుడైన ఆటతీరును చూసి ఇక టీమిండియాలో ప్లేస్ పర్మనెంట్ అని అందరు అనుకున్నారు. కాని సడెన్ ఫిట్నెస్ కోల్పోవడంతో అతని పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.
ఫిట్‌నెస్‌పై పెద్దగా దృష్టి పెట్టలేకపోయిన పృథ్వీ షా ఇప్పుడు బాగా బొద్దుగా మారిపోయాడు. దీనికి తోడు నిత్యం ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉన్నాడు. దీంతో భారత జట్టులో స్థానం కోల్పోయాడు. గత ఐపీఎల్‌లోనూ పూర్తిగా నిరాశపర్చాడు. ఇప్పుడు రాబోయే ధనా ధన్ లీగ్ కోసం మళ్లీ ప్రాక్టీస్ మొదలెట్టాడు. . బాగా బరువు పెరిగి బొద్దుగా మారిపోయిన ఈ టీమిండియా క్రికెటర్‌ను చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అతని ఫిటెనెస్ లెవెల్స్‌పై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ టీమిండియా యంగ్ క్రికెటర్ ఆటతీరు అచ్చం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌లా ఉంటుంది. క్రీజులో స్టాండ్స్, షాట్ సెలెక్షన్ తీరు కూడా టెండూల్కర్ లాగే ఉంటుంది. క్రికెట్‌లో అతనిని సచిన్ వారసుడిగానే చాలామంది భావించారు.
కాని ఇప్పుడు అతనిని చూసి జూనియర్ ఇంజమామ్ అంటున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్ కోసం ప్రాక్టీస్ ప్రారంభించాడు. అయితే 24 ఏళ్ల ఈ టీమిండియా క్రికెటర్ బాగా బరువు పెరిగిపోయాడు. చాలా బొద్దుగా కనిపించాడు. దీంతో పృథ్వీ షాను చూసి క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో కొందరు నెటిజన్లు ఈ క్రికెటర్‌ను ట్రోల్ చేస్తున్నారు. 24 ఏళ్లకే ఇలా మారిపోతే టీమిండియాలో స్థానం ఎలా దక్కించుకుంటాడు? అని నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…