Prabhas : ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి ఇటీవల సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలు చెబుతూ వార్తలలో నిలుస్తున్నాడు. సమంత- నాగ చైతన్య విడిపోయిన విషయం ఈయన ముందే చెప్పడంతో ఇక మనోడి జాతకాలని ఇట్టే నమ్మేస్తున్నారు. అయితే తాజాగా ఆయన ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రాధేశ్యామ్ తర్వాత ఆయన వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణం రాజు వారసుడిగా ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయిన ప్రభాస్.. తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ప్రభాస్ జీవితంలో చాలా చాలా అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయని సినిమా పరిశ్రమ దృష్ట్యా ఇబ్బందులు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు వేణుస్వామి. ప్రస్తుతానికి శని, గురువు స్థానాలు మారుతున్నాయని తద్వారా ప్రభాస్ జాతకం ఇబ్బందికరంగా ఉందని రానున్న రోజులలో ప్రభాస్ అనేక ఇబ్బందులు పడక తప్పదని పేర్కొన్నారు. ప్రభాస్ ది వృశ్చిక రాశి అని పేర్కొన్న ఆయన అర్థాష్టమ శని, ఒకవైపు అష్టమ గురువు, ఒకవైపు షష్ఠమ గురువు మరోవైపు ఉండడంతో ఆయన అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఆయన జీవితంలో అతిపెద్ద సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు.
ఈమధ్య కొన్ని వీడియోస్ లో పూర్తిగా నడవలేని పరిస్థితుల్లో కూడా ప్రభాస్ కనిపిస్తున్నాడని.. అసలు ఆయన జాతకంలో ఎలా ఉంది? వచ్చే ఏడాది ఆయన ఆరోగ్య విషయాలు ఏమిటి? అని యాంకర్ ప్రశ్నించడంతో వేణు స్వామి ఆసక్తికరంగా స్పందించడం జరిగింది. ప్రభాస్ అసలు జాతకాలను నమ్మడని, అందుకే ఆయన జాతకాలను నమ్మకుండా చేసిన జాతకాల సినిమా రాధేశ్యామ్ సినిమ డిజాస్టర్ గా నిలిచిందని వేణు స్వామి కామెంట్ చేశారు. దేవుడి పైన జాతకాల పైన నమ్మకం ఉండాలని లేకుంటే కనుక ఇబ్బందులు తప్పవు అన్నట్లుగా వేణు స్వామి కామెంట్ చేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…