2022 Hit Movies : మరో రెండు రోజులలో 2022 ముగియనుంది. ఈ క్రమంలో ఒకసారి అందరు పాత జ్ఞాపకాలు నెమరువేసుకుంటున్నారు. సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా, వాటిలో కొన్ని చిత్రాలు సంచలనాలు సృష్టించాయి. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది తెలుగుతో పాటు అన్ని ఇండస్ట్రీలు కమర్షియల్ గా మంచి విజయాలు సాధించడంతో పాటు భారీగానే వసూళ్లు రాబట్టాయి. ఈ ఏడాది ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా రూ. 1000 కోట్లు క్రాస్ చేయగా.. పొన్నియన్ సెల్వన్, విక్రమ్, బ్రహ్మాస్త్ర, కాంతార లాంటి సినిమాలు రూ. 400 కోట్లు క్రాస్ చేసి అదరహో అనిపించాయి.
ఈ ఏడాది కొన్ని చిత్రాలు వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి నిర్మాతలలకి కాసులు కురిపించాయి. ఒక భాషకు పరిమితం కాకుండా ఇండియాలో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్ చూస్తే… యశ్, ప్రశాంత్ నీల్, హోంబలే ఫిలిమ్స్ కాంబినేషన్ లో ‘కేజీఎఫ్'(2018)కి సీక్వెల్ గా రూపొందిన కేజీఎఫ్ 2వరల్డ్ వైడ్ రూ. 1235 కోట్లు వసూల్ చేసి 2022 హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఇక ఎన్టీఆర్, రాజమౌళి ప్రధాన పాత్రలలో రూపొందిన ట్రిపుల్ ఆర్ వరల్డ్ వైడ్ రూ. 1170 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక పొన్నియన్ సెల్వన్ 1 చిత్రం తమిళ నవల ఆధారంగా తెరకెక్కి.. రూ. 498 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన ఈ సినిమా.. ఆయన కెరీర్ లో కి బిగ్గెస్ట్ హిట్ గా నిలవగా, ఈ మూవీ రూ. 446 కోట్లు వసూల్ చేసింది.
బాలీవుడ్ చిత్రం బ్రహ్మాస్త్రా రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా రూపొందగా, ఈ సినిమా రూ. 429 కోట్లు రాబట్టింది. ఇక కన్నడ చిత్రం కాంతార తక్కువ బడ్జెట్‌తో రూపొంది రూ. 400 కోట్లు వసూల్ చేసింది. ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం రూ. 15 – 20 కోట్ల బడ్జెట్ తో రూపొందగా, ఈ సినిమా రూ. 338 కోట్లు రాబట్టింది. దృశ్యం 2 ఈ ఏడాది 3వ హైయెస్ట్ గ్రాసర్ గా రూ. 327 కోట్లు కలెక్ట్ చేసింది. భూల్ భూలయ్య 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 266 కోట్లు వసూల్ చేసింది. విజయ్ బీస్ట్ నెగటివ్ టాక్ తో కూడా రూ. 237 కోట్లు రాబట్టడం విశేషం. అలియా భట్ నటించిన గంగూభాయ్ కతియావాడి ఊహించని విధంగా రూ. 209 కోట్లు వసూల్ చేసింది. వలిమై సంక్రాంతి విన్నర్ గా రూ. 200 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక వంద కోట్లు సాధించిన చిత్రాలలో రాధేశ్యామ్, సర్కారు వారి పాట, జేమ్స్, లాల్ సింగన చడ్డా, కార్తికేయ 2, భీమ్లా నాయక్, విక్రాంత్ రోణ, 777 చార్లీ, జుగ్ జుగ్ జియో, గాడ్ ఫాదర్, డాన్, తిరు సినిమాలు నిలిచాయి.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…