Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎంతో బిడియంతో ఉంటాడడనే సంగతి మనందరికి తెలిసిందే. అయితే చాలా కాలం తర్వాత ప్రేక్షకులను చాలా విభిన్నంగా ఆకట్టుకున్నాడు. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఉన్నటువంటి అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్న ప్రభాస్ ఎంతో ఎనర్జీటిక్ గా కనిపిస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ అందించే ప్రయత్నం చేశాడు. తనలోని మరో కోణాన్ని చూపించిన ప్రభాస్.. ఒకసారి కనెక్ట్ అయితే ఎంత క్లోజ్ గా ఉంటాడో కళ్లకు కట్టినట్టు చూపించాడు. అయితే ఈ షోలో ప్రభాస్ అనేక ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.
ప్రభాస్ తన జీవితంలోని ఎన్నో విషయాలను కూడా ఈ షో ద్వారా బయటపెట్టాడు. అయితే ఒకానొక సమయంలో తన అప్పుల గురించి కూడా ప్రభాస్ ఇబ్బంది పడినట్లు అనిపించింది. అంతేకాకుండా అప్పుల కోసమే చక చకా సినిమాలు కూడా సెట్స్ పైకి తీసుకువచ్చినట్లు క్లారిటీ ఇచ్చాడు. ప్రభాస్ యూవి క్రియేషన్స్ ను తన మిర్చి సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేయగా, ఆ సినిమా అనుకోకుండా సెట్స్ పైకి వచ్చింది అని అయితే అప్పుడే రాజమౌళితో బాహుబలి సినిమా కూడా చేసేందుకు ఒప్పుకున్నాను అని ప్రభాస్ చెప్పాడు. చత్రపతి సినిమా తర్వాత మరో సినిమా చేయాలని రాజమౌళి ఎప్పుటి నుంచో అనుకుంటున్నాడు. అయితే మొత్తానికి బాహుబలి గురించి చెప్పగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను.
సినిమా కోసం చాలా టైం కేటాయించాలని ఏ సినిమా మధ్యలో చేయకూడదని ముందుగానే అనుకున్నాను. అందుకే రెబల్ తర్వాత మళ్లీ మరొక సినిమా చేసే అవకాశం రావడంతో మొదట రాజమౌళిని అడిగాను. కొన్ని అప్పులు ఉన్నాయి అని మిర్చి సినిమా చేయొచ్చు అంటారా అని అడిగాను. బాహుబలి ఇంకా అప్పుడు స్క్రిప్ట్ దశలోనే ఉన్న నేపథ్యంలో కొంత టైం పడుతుంది కాబట్టి మరో సినిమా పూర్తి చేసుకోవచ్చు అని చెప్పాడు. అంతకంటే ముందే వారి సతీమణి రామా రాజమౌళి గారిని అడిగినప్పుడు ఎలాగు ఆయన చాలా ఆలస్యం చేస్తారు కాబట్టి నువ్వు హ్యాపీగా ఒక సినిమా పూర్తి చేయవచ్చు అని భరోసా ఇచ్చారని ప్రభాస్ తన పరిస్థితుల గురించి చెప్పాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…