Mokshagna : నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి స్పందించి ఎప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. ఇటీవల గోవా ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొన్న బాలకృష్ణ .. ఈ సందర్భంగా మోక్షజ్ఞ ఎంట్రీపై మాట్లాడారు. తన కుమారుడిని వచ్చే సంవత్సరం టాలీవుడ్‌లోకి పరిచయం చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే, ఆ చిత్రానికి దర్శకుడు ఎవరనేది మాత్రం బాలయ్య స్పష్టతనివ్వలేదు. అయితే బాలయ్య ఆదిత్య 369 సినిమాకి సీక్వెల్‌గా ఆదిత్య 999 సినిమాని చేయాలని చూస్తుండగా, ఈ సినిమాతో మోక్షజ్ఞని ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నాడని తెలుస్తుంది.
‘ఆదిత్య 999’ పేరుతో సీక్వెల్ ప్లాన్ చేసిన బాలయ్య.. ఇప్పటికే ముహూర్తం ఫిక్స్ చేశారని, ఫిబ్రవరిలో లాంచింగ్ ఉంటుందని సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సినిమాలో బాలయ్య, మోక్షజ్ఞ ఇద్దరు కలిసి నటిస్తారని టాక్. ప్రస్తుతం మోక్షజ్ఞ యాక్టింగ్‌లో ట్రైనింగ్ తీసుకుంటుండగా..ఆయన ఎంట్రీకి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి అని తెలుస్తోంది. నిజానికి మోక్షజ్ఞ లాంచింగ్ మూవీ కోసం బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి పేర్లు వినిపించినప్పటికీ ప్రస్తుతానికి ఎటువంటి క్లారిటీ అయితే లేదు. మరి ఆదిత్య 999 సినిమాతో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని వస్తున్న వార్తలలో నిజం ఎంత ఉందనేది చూడాల్సి ఉంది.
టెక్నాలజీ పెద్దగా లేని సమయంలోనే టైమ్ మెషిన్ కాన్సెప్ట్‌తో ‘ఆదిత్య 369’ సైన్స్ ఫిక్షన్ మూవీని అద్భుతంగా తీయగలిగారు. మరి ఇప్పుడు సాంకేతికత భారీ స్థాయిలో అభివృద్ధి చెందినందున ఇప్పుడు ‘ఆదిత్య 999’ సినిమాని మరింత రిచ్‌గా తీయాలనే ప్లాన్ బాలయ్య చేసినట్టు టాక్. ఈ సినిమాకి తనే కథ అందించినట్లు బాలయ్య గతంలోనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక బాలయ్య ప్రస్తుతం వీరసింహారెడ్డి చిత్రంతో బిజీగా ఉన్నారు. జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇప్పటికే పాటలు, బాలయ్య సిగ్నేచర్ స్టెప్పులతో ఈ సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. మరోవైపు అన్‌స్టాపబుల్ అనే టాక్ షో చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…