Rohit Sharma : సంపాద‌న‌లో అంద‌రి క‌న్నా టాప్‌లో రోహిత్.. ఆయ‌న త‌ర్వాతే కోహ్లీ, ధోని..!

Rohit Sharma : టీమిండియా కెప్టెన్, ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఐపీఎల్‌ రికార్డులు తిరగరాస్తున్నాడు. 16 సీజన్లకు అత్యధికంగా డబ్బులు ఆర్జించిన ఆటగాడిగా నిలిచాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ నాయకుడు ఎంఎస్ ధోనీని రెండో స్థానానికి నెట్టేశాడు. రాబోయే రెండు సీజన్లు ఆడితే హిట్‌మ్యాన్‌ ఖాతాలో మరింత సొమ్ము జమ ఖావ‌డం ఖాయం అంటున్నారు. రోహిత్ శర్మ గత 16 ఏళ్లలో ఐపీఎల్ ద్వారా మొత్తం 178.6 కోట్ల రూపాయలు సంపాదించ‌గా, మహేంద్ర సింగ్ ధోని ఇన్నేళ్లలో ఐపీఎల్ ద్వారా రూ.176.84 కోట్లు మాత్ర‌మే ఆర్జించాడు. ఐపీఎల్‌లో సంపాదనలో రోహిత్-ధోనీ తర్వాత విరాట్ కోహ్లీ మూడో స్థానంలో నిలిచాడు. 16 ఐపీఎల్ సీజన్ల ద్వారా విరాట్ ఇప్పటివరకు రూ.173.2 కోట్లు సంపాదించాడు.

ప్రపంచంలోనే అత్యధిక మంది వీక్షించే క్రికెట్‌ లీగ్‌ ఐపీఎల్ కాగా, ఇది 2008లో ఆరంభమైంది. ఆ నాటి నుంచి కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఉన్న వాటిని బద్దలు కొడుతోంది. ఈ భూమ్మీద అత్యంత విలువైన క్రికెట్‌ టోర్నీగా ఎదగ‌డంతో పాటు ఆటగాళ్లకు ఫీజు చెల్లించడం నుంచి ప్రసార హక్కుల వరకు వేల కోట్ల రూపాయల్లోనే డీల్ చేస్తుండ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌పరుస్తుంది. ఈ మధ్యే ఐపీఎల్‌ విలువ దాదాపుగా రూ.లక్ష కోట్లకు చేరువైంది. భారత జీడీపీ పెరుగుదలకు ఇతోధికంగా సాయపడుతోంది. అలాగే స్టార్‌ క్రికెటర్ల ఇంట డబ్బుల వర్షం కూడా కురిపించింది.

Rohit Sharma tops the list in earning before kohli and dhoni
Rohit Sharma

ఇటీవల కొచ్చి వేదికగా జరిగిన ఐపీఎల్ 2023 మినీ వేలం జ‌ర‌గ‌గా, ఇంగ్లాండ్ యువ ఆల్ రౌండర్ సామ్ కరన్(రూ.18.50 కోట్లు) ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అయితే మనీబాల్ నివేదిక ప్రకారం.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ గత 16 ఏళ్లలో ఐపీఎల్ ద్వారా ఎక్కువ మొత్తం ఆర్జించ‌గా, త‌ర్వాతి స్థానాల‌లో ధోని, కోహ్లీ, సురేష్ రైనా, రవీంద్ర జడేజా, సునీల్ నరైన్ ఉన్నారు. ధోనీ గత ఐపీఎల్ సీజన్‌లో ధోనీ తన వేతనాన్ని రూ.12 కోట్లకు తగ్గించుకున్నాడు. దీంతో అతను అగ్రస్థానాన్ని కోల్పోయాడు. ఇక ఐపీఎల్ ద్వారా ఎక్కువ మొత్తం సంపాదించిన టాప్-10 క్రికెటర్లు.. (2008 – 2022) చూస్తే.. 1) రోహిత్ శర్మ – 178.6 కోట్లు 2) ఎంఎస్ ధోని – 176.84 కోట్లు 3) విరాట్ కోహ్లీ – 173.2 కోట్లు 4) సురేష్ రైనా – 110 కోట్లు 5) రవీంద్ర జడేజా – 109 కోట్లు 6) సునీల్ నరైన్ – 107.2 కోట్లు 7) ఎబి డివిలియర్స్ – 102.5 కోట్లు 8) గౌతమ్ గంభీర్ – 94.62 కోట్లు 9) శిఖర్ ధావన్ – 91.8 కోట్లు 10) దినేష్ కార్తీక్ – 86.92 కోట్లు ఉన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 day ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago