Prabhas : అన్‌స్టాప‌బుల్ షోలో కృష్ణంరాజును త‌ల‌చుకుని ఎమోష‌న‌ల్ అయిన ప్ర‌భాస్‌

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా ఈశ్వర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రభాస్ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయిన ఆయనపై అభిమానులకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గడంలేదు. ప్రభాస్ నుంచి ఎప్పుడెప్పుడు కొత్త సినిమా వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే స‌మ‌యంలో ఇప్పుడు ఆయ‌న బాల‌కృష్ణ షోలో సంద‌డి చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. ప్ర‌భాస్‌తో పాటు గోపిచంద్ కూడా ఈ షోలో పాల్గొన‌గా, దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుద‌లైంది.

ఈ ప్రోమోలో భాగంగా దివంగత నటుడు కృష్ణంరాజు గారికు నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే కృష్ణంరాజు స్పెషల్ ఏవిని ప్రదర్శించారు.అనంతరం రెండు నిమిషాల పాటు మౌనం పాటించిన తర్వాత ప్రభాస్ తన పెదనాన్న కృష్ణంరాజు గారు చెప్పిన మాటలను గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టుకున్నారు. కృష్ణంరాజు ఏవి చూసి ఎమోషనల్ కావడంతో ఒక్కసారిగా షో మొత్తం నిశ్శబ్ద వాతావరణం సంతరించుకుంది. ఇక ప్రభాస్.. తన పెదనాన్న గురించి మాట్లాడుతూ పెదనాన్న తనకి ఎప్పుడూ ఒకటే చెప్పేవారని, శత్రువు మన ఇంటికి వచ్చిన మర్యాదలు ఇవ్వాలని, కోపతాపాలని బయట చూసుకోవాలని కృష్ణంరాజు తనకు చెప్పేవారని ఆ మాటలను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.

Prabhas got emotional in unstoppable show
Prabhas

ప్ర‌భాస్ అంటే త‌న‌కు ఎంతో ఇష్టమని ఈ సందర్భంగా ప్రభాస్ తెలిపారు.ఇక కృష్ణంరాజు 2022 సెప్టెంబర్ 11వ తేదీ అనారోగ్య సమస్యలతో మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ షోకి ఒక మహారాజును ఆహ్వానిస్తున్నట్లుగా ప్రభాస్ ని షోలోకి స్వాగతం పలికాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. ప్రభాస్ ఎంట్రీతో సెట్ మొత్తం ప్రేక్షకుల అరుపులు, కేకలతో మారుమోగిపోయింది. సభాముఖంగా ప్రేమగా అడుగుతున్నాను.. నన్ను కూడా డార్లింగ్ అని పిలవాలని బాలయ్య అంటే సరే డార్లింగ్ సార్ అని ప్రభాస్ అన్నాడు. మొన్న శర్వానంద్ వచ్చాడు. పెళ్లెప్పుడని అడిగా.. ప్రభాస్ తర్వాత అన్నాడు అని బాలకృష్ణ అంటే.. నేను సల్మాన్ ఖాన్ తర్వాత అనాలేమో అని అందరినీ నవ్వించాడు ప్రభాస్.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago