Mahesh Babu : టాలీవుడ్ మోస్ట్ క్యూట్ వ్ కపుల్స్‌లో నమ్రత- మహేష్ బాబు జంట ఒకటి. వృత్తి పరంగా ఓకే రంగానికి చెందిన ఈ దంపతులు ప్రేమించి పెళ్లిచేసుకొని దాంపత్య జీవితాన్ని ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. భర్త మహేష్ బాబుకు చేదోడువాదోడుగా ఉంటూ ఆయన విజయంలో పాలుపంచుకుంటోంది నమ్రత. వంశీ సినిమా సమయంలో తన కో- స్టార్ మహేష్ బాబుతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది. వారి వారి స్వభావాలు కలవడంతో ప్రేమించుకొని మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంటకి సితార, గౌతమ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్న విషయం తెలిసిందే.
తాజాగా నమ్రత తన పెళ్లి దగ్గరి నుంచి నేటి వరకు జరిగిన విషయాలపై ఓపెన్ అయింది. మహేష్ బాబు నటించిన సినిమాల్లో తనకు పోకిరి సినిమా చాలా ఇష్టమని చెప్పిన నమ్రత.. తమ వ్యక్తిగత విషయాలు కూడా చెప్పుకొచ్చింది. తనకు వంట రాదని, ఆమ్లెట్, టీ, కాఫీ, మ్యాగీ వంటివి మాత్రమే చేయగలను అంటూ మొహమాటం లేకుండా నమ్రత. వంట కోసం ఇంట్లో పనిమనిషి ఉంటుందని చెప్పింది. పెళ్లి తరువాత సినిమాల్లో నటించకూడదని మహేష్ ముందుగానే కండీషన్ పెట్టారని తెలిపింది.
ఇక నేను కూడా ఓ కండీషన్ పెట్టానంటూ నమ్రత చెప్పుకు రాగా, పెళ్లి తర్వాత వెంటనే పెద్ద బంగ్లాకో వెళ్లకూడదు అని చెప్పాను. నాకు పెద్ద బంగ్లాలలో నివసించడం చాలా భయం. ముందు అపార్ట్‌మెంట్‌లో నివసించి ఆ తర్వాత బంగ్లాకి వెళదాం అని చెప్పాను అంటూ నమ్రత చెప్పుకొచ్చింది. మహేష్‌తో పెళ్లి జరగడమే తనకు హ్యాపీ మూమెంట్ అని చెప్పిన నమ్రత.. సితార అన్ వాటెండ్ బేబీ అని చెప్పి షాకిచ్చింది. ఒకవేళ సితార పుట్టి ఉండకపోతే మా జీవితాలు అసంపూర్ణంగానే ఉండేవేమో అని కూడా ఆమె చెప్పడం విశేషం. అలాగే గౌతమ్ పుట్టిన సమయంలో ఎన్నో కష్టాలు పడ్డామని, గౌతమ్ బతుకుతాడో లేదో అని వైద్యులు చెప్పారని తెలిపింది. అందరి జీవితాల్లో కొన్ని బాధలుంటాయి.. మాకు గౌతమ్ రూపంలో బాధలు వెంటాడాయి అని చెప్పుకొచ్చింది నమ్రత శిరోద్కర్.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…