Posani Krishna Murali : ప్రస్తుత ఎఫ్‌డీసీ చైర్మన్ పోసాని కృష్ణ మురళి గత కొద్ది రోజులుగా సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖుల గురించి దారుణమైన కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ముందుగా పవన్‌పై దారుణమైన కామెంట్స్ చేసిన పోసాని ఆ తర్వాత బాలయ్యని విమర్శించాడు. ఇక రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావుని ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఇలా ఓపెన్‌గా మాట్లాడితే.. మాగ్జిమం ఏం చేస్తారు. పోసానిగాడికి వేషాలు ఇవ్వొద్దు. అని తొక్కి పెట్టాలనుకుంటారు. నేను బాగా సెటిల్డ్. ఈ మాట రాఘవేంద్రరావుకే డైరెక్ట్‌గా చెబుతున్నాను. ఇలాంటి బ్లాక్ మెయిల్స్ చాలానే ఉన్నాయి అని అన్నాడు నటుడు, రచయిత పోసాని.
ఇండస్ట్రీలో రాఘవేంద్ర రావు గారు ఎంతో గొప్ప డైరెక్టర్ ఆయనంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. వైసీపీ గెలిచాక పృథ్వీరాజ్ ఎస్వీబీసి చైర్మన్‌గా నియమించబడ్డాడు. అయితే ఆ సమయంలో పృథ్విరాజ్ తనకు ఫోన్ చేసి డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారు చాలా అవినీతి పనులు చేశారు. వాటిని కక్కిస్తానంటూ నాకు చెప్పాడు అని పోసాని అన్నారు. ఒకరోజు రాఘవేంద్రరావు ఉదయాన్నే కాల్ చేసి ఏం పోసాని నేను ఏదో అవినీతి చేశానట పృథ్వీరాజ్ అవన్నీ కక్కిస్తారని అడగగా, దానికి సార్ మీరు లంచాలు తిన్నారో లేదో నాకు తెలియదు కానీ నేను చెబుతాలేండి అని అన్నాను . తర్వాత రాఘవేంద్రరావుగారే ఫోన్ చేసి థాంక్స్ చెప్పారు.
పృథ్వీ పదవి దిగిపోయినప్పుడు మళ్లీ నాకు రాఘవేంద్రరావుగారు ఫోన్ చేసి ‘హ హ హ.. మురళి’ అన్నారు. ఏదైతే పృథ్వీని తిట్టాడో తననే పిలిచి మళ్లీ వేషమిచ్చాడు. అందుకు కారణం పృథ్వీ వైసీపీలో లేడుగా. నేను ఇంకా వైసీపీలో ఉన్నానుగా. నాతో పని చేయించుకుంటాడు కానీ నన్నో విలన్‌లాగా చూస్తాడు. ఓ సారి నాతో మాట్లాడుతూ ‘రావణాసురుడు కోసం అతని కొడుకు మేఘనాథుడు చచ్చిపోయాడు. అలా నువ్వు కూడా ఈ రావణాసురుడు కోసం చచ్చిపోతావా.. హ హ హ’ అని అన్నాడు. అంటే రాఘవేంద్రరావుగారిలాంటి వాళ్లకు కూడా జగన్‌పై పీకల దాకా కోపం ఉంది అని పోసాని సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…