Posani Krishna Murali : క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు పోసాని కృష్ణ మురళి. వైసీపీలోకి చేరాక ఆయన పలువురిపై తెగ విరుచుకుపడుతున్నారు.తాజాగా ఎమ్మెల్యే బాలకృష్ణపై నటుడు, పోసాని కృష్ణమురళి విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ సీఎం ఎస్ జగన్‌ని బాలకృష్ణ సైకో అనడంపై పోసాని రియాక్ట్ అవుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి సైకోనా, లేక బాలకృష్ణ సైకోనా అని ఓసారి ఆత్మ విమర్శ చేసుకోవాలంటూ రెచ్చిపోయారు. ఇంట్లో కాల్పులు జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా.. సినిమా షూటింగ్ కు బాలకృష్ణ ఎలా వెళ్ళగలిగారో అందరికీ తెలుసు అంటూ పోసాని చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
బాలకృష్ణ గారు తుపాకీతో టపీ టపీమని ఇద్దరిని కాల్చేశారు. ఇలా సైకోలు కాలుస్తారా? లేక మంచివాళ్లు కాలుస్తారా? అంటూ బాలకృష్ణపై పోసాని మండిపడ్డారు. మనకు చట్టం, న్యాయం అన్నీ ఉన్నాయి.. ఆయనకేమైనా సమస్య ఉంటే పోలీస్ స్టేషన్‌కి వెళ్లాలి కానీ గన్ ఉంది కదా అని కాల్చేస్తారా? అన్నారు. పోనీ అలా కాల్చిన తర్వాత ఒక రోజైన జైలులో ఉన్నాడా? అదే నేను ఇద్దరిని కాల్చాననుకోండి. పోసాని అమాయకుడని వదిలేస్తారా? కొట్టి బొక్కలో పెట్టి రిమాండ్‌కి పంపించి జైలులో పెడతారు కదా.
![Posani Krishna Murali : బాలకృష్ణ పెద్ద సైకో.. ఇంట్లో వాచ్‌మెన్ శవాన్ని పెట్టుకొని.. పోసాని సంచలన కామెంట్స్.. Posani Krishna Murali sensational comments on balakrishna](http://3.0.182.119/wp-content/uploads/2023/04/posani-krishnamurali-balakrishna.jpg)
నువ్వు మాత్రం ఒకరోజు కూడా జైలుకెళ్లలేదు. ఎవరు అసమర్ధుడు.. ఎవరు క్రూరుడు, ఎవరు మానసికంగా బాధపడుతున్నారో చెప్పాలి అంటూ పోసాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మీ ఇంట్లో మీ కళ్ల ముందే నైట్ వాచ్‌మెన్ చనిపోతే.. మేకప్ వేసుకుని డెడ్ బాడీని దాటుకుని షూటింగ్ వెళతారాఆ.. కాని బాలకృష్ణ వెళ్లిపోయారు. శవం కూడా అక్కడే ఉంటే దాటుకొని వెళ్లారు. ఎవరైనా ఎప్పుడైనా ఈ విషయం అడిగారా? మరి మా జగన్ మోహన్ రెడ్డి గారు సైకోనా! బాలకృష్ణ సైకోనా ? ఇప్పుడు చెప్పండి. ఆయనకు ఆయనే ప్రశ్నించుకోమనండి అని పోసాని సంచలన కామెంట్స్ చేశారు.