Ponniyin Selvan 1 : ఇటీవల థియేటర్స్‌లో విడుదలైన ప్రతి సినిమా కొద్ది రోజులకే ఓటీటీలో విడుదలై సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ బాహుబలిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పొన్నియన్ సెల్వన్ కూడా ఇప్పుడు ఓటీటీ లో వినోదాన్ని పంచేందుకు రెడీ అయింది.ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన అద్భుతం పొన్నియన్ సెల్వన్. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. పొన్నియన్ సెల్వన్ మూవీకి మంచి రెస్సాన్స్ వస్తోంది. ఇక యూఎస్‌లో అయితే పొన్నియన్ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. సెప్టెంబర్ 30న విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ హౌజ్ ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది.
విక్రమ్, జయంరవి, కార్తీ, ఐశ్వర్యారాయ్, త్రిషలాంటి భారీ స్టార్ కాస్టింగ్‌తో తెరకెక్కిన ఈ సినిమా తమిళనాడులో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. కమల్ హాసన్ హీరోగా వచ్చిన విక్రమ్ సినిమా రికార్డులను సైతం బ్రేక్ చేయడం విశేషం. ఈ చిత్రం అమేజాన్ ప్రైమ్ లో నవంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఓటిటిలో తెలుగు,తమిళ,కన్నడ వెర్షన్స్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఓటిటి లో కూడా భారీగా వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు.
భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం రూపొందింది. రెండు పార్ట్‌లుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తొలా పార్ట్ సెప్టెంబర్ 30న విడుదల కాగా, రెండో పార్ట్ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ లేకపోవడంతో దీపావళి వరకు ఈ సినిమా మంచి బిజినెస్ చేసింది. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ మూవీని నిర్మించారు మణి. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. విక్రమ్, కోబ్రా మూవీ తర్వాత భారీ విజయాన్ని సాధించిన చిత్రంగా నిలిచింది పొన్నియిన్ సెల్వన్. ఈ చిత్రానికి ఓవర్సీస్ లో మంచి వసూళ్లు నమోదు అవుతున్నట్టు తమిళ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియాలోనూ ఈ చిత్రం దూసుకెళ్తోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…